విద్యా బాలన్‌కు షారుక్ పెళ్లి ప్రపోజల్?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్....బాలీవుడ్ హాట్ లేడీ విద్యా బాలన్‌కు పెళ్లి ప్రపోజల్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. వినడానికి ఆశ్యర్యంగా ఉంది కదూ..
ఇదీ అసలు స్టోరీ...
విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత ఎక్తా కపూర్ మాట్లాడుతూ.....విద్యా తన పేరును విద్యా బాలన్ ఖాన్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో అని వ్యాఖ్యానించింది. సినిమా మొత్తం భారాన్ని తన భుజాలపై మోసందని, ఖాన్ సినిమాల లెవల్లో వసూళ్లూ రావడానికి ఆమేకారణం అనేది ఎక్తా మాటల్లోని అర్థం. ఇదే సమయంలో విద్యా జోక్ చేస్తూ....అందరి ఖాన్ పక్కన తన సర్ నేమ్ పెట్టుంటే పోలా అంటూ వ్యాఖ్యానించింది.
విద్యా వ్యాఖ్యలపై షారుఖ్ ఖాన్ ఇటీవల స్పందిస్తూ.....విద్యా బాలన్ నన్ను పెళ్లి చేసుకుంటే నా పేరు పక్కన ఆవిడ సర్ నేమ్ 'బాలన్' అని పెట్టుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కౌంటర్ ఇచ్చారు. అదన్నమాట మ్యాటర్.
ఇక పోతే...విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలైన దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లు సాధించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











