ఆ చిత్రం కోసం కోటి రూపాయలతో షారూఖ్ డ్రెస్

By Srikanya

కమర్షియల్ గా ఉంటూనే విభిన్నత కోసం ప్రయత్నించే స్టార్స్ లో షారూఖ్ ఖాన్ మొదటి వరసలో ఉంటారు. ఆయన తాజాగా నటింస్తూ నిర్మిస్తున్న చిత్రం 'రా. వన్‌'. కరీనా కపూర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌ రామ్‌పాల్‌ ఓ కీలక పాత్రధారి. ఇక ఈ చిత్రంలో షారూఖ్ సూపర్ మ్యాన్ తరహా అవుట్ ఫిట్స్ ధరించనున్నారు.అలాగే ఆ బట్టలు పిల్లలను ఆకట్టుకునేలా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన కోటి రూపాయలు బడ్జెట్ ని కేటాయించారు. ఈ డ్రెస్ డిజైన్ కోసం ఆయన తన టీమ్ ని అమెరికాలోని కొన్ని ఫ్యాషన్ డిజైనింగ్ సంస్ధలకు పంపి ఎంక్వైరీ చేయిస్తున్నారు. రబ్బర్,లెదర్ తో కూడిన కాంబినేషన్ తో ఈ అవుట్ ఫిట్ తయారు చేయంచాలని ఆయన ఆశిస్తున్నారు.

ఇక అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం శ్రీరామనవమి రోజున గోవాలో చిత్రీకరణ మొదలవుతుంది. షారుఖ్ ‌తో సహా ప్రధాన తారాగణమంతా గోవా చేరుకుంది. షూటింగ్ కొంత జరిగేసరికల్లా ఆ డ్రెస్ పూర్తవ్వాలని ఆశిస్తున్నారు. ఇక ఐపీఎల్ ‌లో తన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుని ఉత్తేజపరచటానికి జూహీ చావ్లాకి బాధ్యత అప్పగించారు. అన్నట్టు ఆమెకు కూడా ఆ జట్టు యాజమాన్యంలో భాగస్వామ్యముంది కాబట్టి ఒప్పుకుంది. ఇక రావన్ పేరుతో తయారవుతున్న ఈ చిత్రం టైటిల్ మణిరత్నం రావణ్ చిత్రం టైటిల్ కి ఇబ్బందిగా మారింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ మార్చమని మణిరత్నం అడగనున్నట్లు తెలుస్తోంది. గతంలో మణిరత్మం, షారూఖ్ కాంబినేషన్ లో దిల్ సే చిత్రం వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X