అంబానీల ఇంట పెళ్లి సందడి: భార్యతో కలిసి స్టెప్పులేసిన షారుక్ ఖాన్ (ఫోటోస్)
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన భార్యతో కలిసి డాన్స్ చేసిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అరుదైన సంఘటన ప్రముఖ వ్యాపార వేత్త, దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి వేడుకలో చోటు చేసుకుంది.
ఇషా అంబానీ వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యాయి. దేశ విదేశాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, పాప్ స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకలో
భాగంగా జరిగిన సంగీత్ వేడుకలో షారుక్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి డాన్స్ చేశారు.
ప్రత్యేక విమానంలో..
షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ముంబై నుంచి ప్రైవేట్ ఫ్లైట్లో శనివారం ఉదయపూర్ చేరుకున్నారు. సంగీత్ వేడుకకు షారుక్ ఖాన్ దంపతులతో పాటు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా తదితరులు హాజరయ్యారు.

హిల్లరి క్లింటన్ కూడా
ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీతో కలిసి హాజరవ్వగా... బాలీవుడ్ బ్యూటీలు కరిష్మా కపూర్, జాక్వెల్ ఫెర్నాండెజ్ తదితరులు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు హిల్లరీ క్లింటన్ కూడా ఇషా అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
భారీ భద్రత మధ్య
కొత్తగా పెళ్లయిన ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు శుక్రవారం ఉదయమే ఉదయ్ పూర్ చేరుకున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

ఇషా-ఆనంద్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏకైక కూతురైన 27 ఏళ్ల ఇషా అంబానీ తను ప్రేమించిన 33 ఏళ్ల ఆనంద్ పిరమల్‌ను పెళ్లాడుతోంది. ముంబైలో ఈ బుధవారం వీరి వివాహం జరుగబోతోంది. అయితే ఈ వీకెండ్ నుంచే ఉదయ్ పూర్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

బియాన్స్
ఇషా అంబానీ పెళ్లి వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు హాజరైన అమెరికన్ పాప్ సింగర్ బియాన్స్.


Click it and Unblock the Notifications











