షాకింగ్: షారుక్-సల్మాన్ ఆలింగనం (ఫోటోలు)
ముంబై : ఇది ఒకరకంగా షాకింగ్ న్యూసే. కానీ ఇది అక్షరాల నిజం. ఒకరితో ఒకరికి పడక ప్రత్యర్థుల్లా మారిన బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆందరినీ ఆశ్చర్య పరుస్తూ ఆత్మీ ఆలింగనం చేసుకున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముంబైలో జరిగిన ఇఫ్తార్ విందులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఎంఎల్ఏ బాబా సిద్ధిఖీ ముంబైలో ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి షారుక్ ఖాన్‌తో పాటు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరితో కలిసి బాబా సిద్ధిఖీ ఫోటో దిగారు. అనంతరం షారుక్-సల్మాన్ చేతులు కలిపి ఆపై ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సిద్ధిఖీ మాట్లాడుతూ...'సల్మాన్-షారుక్ నా చిన్ననాటి స్నేహితులు. వారు తమకు తాముగా ఒకరినొకరు కలుసుకున్నారు' అని వెల్లడించారు. గతంలో 2008లో కత్రినా కైఫ్ బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన గొడవ తర్వాత మళ్లీ ఇద్దరూ కలుసుకోలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇద్దరు ఒకట్టవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ముంబైలో జరిగిన ఇఫ్తార్ విందులో సల్మాన్, షారుక్
ఎమ్మెల్యే సిద్ధిఖీ ముంబైలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కూడా హాజరయ్యారు. సిద్ధికీ మాట్లాడుతూ సల్మాన్-షారుక్ తన చిన్ననాటి స్నేహితులు అని వెల్లడించారు.

సల్మాన్-షారుక్ ఆలింగనం
ముంబైలో ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరూ ఇలా కలవడం పట్ల ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధిఖీ
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోను నిశితంగా గమనిస్తే బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఎమ్మెల్యే బాబా సిద్దికీ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వీరు చిన్న నాటి స్నేహితులు కూడా. ఇప్తార్ విందులో ఇలా సరదాగా గడిపారు.

కౌన్ బనేగా కరోడ్ పతి షోలో సల్మాన్-షారుక్
ఒకప్పుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉండే వారు. కౌన్ బనేగా కరోడ్ పతి 3 కార్యక్రమంలో షారుక్ మాట్లాడుతూ సల్మాన్ మా ఫ్యామిలీలో వ్యక్తి అని వెల్లడించారు.

ఒకరిపై ఒకరు పొగడ్తలు
షారుక్ ఖాన్ తన స్నేహితుడు సల్మాన్ గురించి అనేక సందర్భాల్లో పొగడ్తల వర్షం కురిపించారు. అదే విధంగా సల్మాన్ ఖాన్ కూడా తన స్నేహితుడు షారుక్ ఖాన్ గురించి అనేక సందర్బాల్లో ప్రశంసించారు. ఒకరిపై ఒకరు ఎంతో గౌరవం ప్రదర్శించే వారు.

షారుక్-సల్మాన్ మధ్య విరోధం
ఆరేళ్ల క్రితం కత్రినా కైఫ్ పుట్టినరోజు పార్టీ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మధ్య విరోధం ఏర్పడింది. అక్కడ జరిగిన గొడవే అందుకు కారణం. అప్పటి నుంచి వారు మళ్లీ అసలు కలుసు కోలేదు.

మొత్తానికి విరోధం ముగిసింది
ఎట్టకేలకు ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న విరోధం ముగిసింది. వీరు ఆదివారం జరిగిన ఇప్తార్ విందులో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరి చిన్ననాటి స్నేహితుడైన ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు.


Click it and Unblock the Notifications











