ఆ స్టార్ హీరోలు ప్రత్యర్థులు..కానీ కలిసారు (ఫోటోలు)
ముంబై : ఒకరితో ఒకరికి పడక ప్రత్యర్థుల్లా మారిన బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆందరినీ ఆశ్చర్య పరుస్తూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 2013లో ముంబైలో జరిగిన ఇఫ్తార్ విందులో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే.
వీరి క్లోజ్ ఫ్రెండ్ అయిన బాబా సిద్ధిఖీ ముంబై ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి షారుక్ ఖాన్‌తో పాటు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరితో కలిసి బాబా సిద్ధిఖీ ఫోటో దిగారు. అనంతరం షారుక్-సల్మాన్ చేతులు కలిపి ఆపై ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తాజాగా మళ్లీ రంజాన్ పవిత్ర మాసం వచ్చేసింది. బాబా సిద్దికీ మళ్లీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. మరోసారి షారుక్-సల్మాన్ కలిసారు.
గతంలో 2008లో కత్రినా కైఫ్ బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన గొడవ తర్వాత మళ్లీ ఇద్దరూ కలుసుకోలేదు. బాబా సిద్ధిఖీ ఇఫ్తార్ విందులో వీరు కలసారు.

షారుక్-సల్మాన్
ఎమ్మెల్యే సిద్ధిఖీ ముంబైలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కూడా హాజరయ్యారు.

మాట్లాడుకుంటున్న షారుక్, సల్మాన్
బాబా సిద్ధిఖీ ఇఫ్తార్ విందు సందర్భంగా షారుక్, సల్మాన్ కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యం.

2013లో...
2013లో బాబా సిద్ధిఖీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న షారుక్, సల్మాన్...

2013లో అవార్డుల కార్యక్రమంలో...
2013లో జరిగిన బాలీవుడ్ అవార్డుల కార్యక్రమంలో షారుక్, సల్మాన్ ఇలా...

సల్మాన్, షారుక్
ఒకప్పుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉండే వారు. కౌన్ బనేగా కరోడ్ పతి 3 కార్యక్రమంలో షారుక్ మాట్లాడుతూ సల్మాన్ మా ఫ్యామిలీలో వ్యక్తి అని వెల్లడించారు.

పొగడ్తలు...
షారుక్ ఖాన్ తన స్నేహితుడు సల్మాన్ గురించి అనేక సందర్భాల్లో పొగడ్తల వర్షం కురిపించారు. అదే విధంగా సల్మాన్ ఖాన్ కూడా తన స్నేహితుడు షారుక్ ఖాన్ గురించి అనేక సందర్బాల్లో ప్రశంసించారు. ఒకరిపై ఒకరు ఎంతో గౌరవం ప్రదర్శించే వారు.

అలా విడిపోయారు
ఆరేళ్ల క్రితం కత్రినా కైఫ్ పుట్టినరోజు పార్టీ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మధ్య విరోధం ఏర్పడింది. అక్కడ జరిగిన గొడవే అందుకు కారణం. అప్పటి నుంచి వారు మళ్లీ అసలు కలుసు కోలేదు.


Click it and Unblock the Notifications











