సల్మాన్‌తో ప్యాచపా, ముచ్చటే లేదు: షారూఖ్
ముంబై: దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్‌తో తాను ప్యాచప్ చేసుకున్నట్లు వచ్చిన వార్తలను బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొట్టిపారేశారు. "చిన్నప్పటి నుంచీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ప్లీజ్! పెరగండి" అని షారూఖ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. యాష్ చోప్రా సినిమా జబ్ తక్ హై జాన్ సినిమా ప్రీమియర్‌లో షారూఖ్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ పాల్గొనడంతో వారి మధ్య విభేదాలు సమసిపోయినట్లు వార్తలు వచ్చాయి.
ప్రీమియర్ షో ముగిసిన తర్వాత మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ - "యువకులందరితో తాను కలిసి నాట్యం చేశా.. అద్భుతమైన సాయంత్రం.... సల్మాన్, అమీర్, షారూఖ్, కత్రినా, అనుష్కలతో గడిపాను..." అని ట్వీట్ చేశారు. బిగ్ బీ ట్వీట్ గురించి అడిగినప్పుడు అమితాబ్ అలా ట్వీట్ చేస్తే ఆయన్నే అడగండి అని షారూఖ్ అన్నారు. ప్యాచప్ ఏదీ లేదని చెప్పాడు.
పత్రికల్లో రాసిందంతా చదివానని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. కత్రినా కైఫ్ జన్మదిన వేడుకల్లో 2008లో సల్మాన్, షారూఖ్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అప్పటి నుంచి ఇరువురి మధ్య సఖ్యత లేకుండా పోయింది.
మీడియా ప్రతినిధుల సమావేశంలో షారూఖ్ ఖాన్ ప్యాచప్ లేదా ఎక్స్‌వైజడ్ ఏదీ లేదని చెప్పారు.


Click it and Unblock the Notifications











