twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డ్‌ లు బ్రద్దలు కావాల్సిందే అంటున్నాడు

    By Srikanya
    |

    బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా 'రా.వన్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డ్‌ సృష్టించాలని కోరుకుంటున్నాడు. ఈ చిత్రం దీపావళి రోజైన అక్టోబర్‌ 26న విడుదల కానుంది. ఒకప్పటి ప్రత్యర్థి సల్మాన్‌ చిత్రాలు సాధించిన ఘన విజయాల్ని ప్రస్తావించిన షారుఖ్‌, సల్లూభాయ్‌తో తాను పోటీపడటం లేదని పేర్కొంటూనే రా.వన్‌ పాత రికార్డ్‌లను అధిగమించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ''ప్రతి సినిమాకూ దానికంటూ ఒక స్థానం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మూడునాలుగు సినిమాలు మంచి బిజినెస్‌ చేశాయి. బాక్సాఫీస్‌ విషయానికొస్తే ఈ నా కొత్త సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఆ చిత్రాలు సాధించిన విజయాన్ని మేమూ అందుకోగలమని ఆశాభావంతో ఉన్నాను'' అని మీడియాతో అంటున్నాడు.

    అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్‌ హీరో చిత్రం 'రా.వన్‌'లో షారుఖ్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల కంటే భారీ వ్యయంతో సిద్ధమవుతున్న రా.వన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3డి ఫార్మాట్‌లో తమిళ్‌, తెలుగు, జర్మన్‌ భాషల్లో డబ్బింగ్‌తో విడుదలవుతుంది. ''నేను భారీ వ్యయంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా వెంట నిలిచిన పార్టనర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళు డబ్బు పెట్టినందుకు కాదు, నా సినిమా మీద నమ్మకముంచినందుకు. ఆ సొమ్ము తిరిగి రావాలంటే గతంలో ఎన్నడూ జరగనంత బిజినెస్‌ జరగాలి'' అని తన కోరిక వెల్లబుచ్చాడు.

    English summary
    "Every film has its own space. I am happy that in the recent past there are three or four films which have done great business. When it comes to box office, I hope even my film is good enough. We hope we will be able to touch the success of those films," Shahrukh told reporters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X