షారూక్ భార్య చాలా హాట్ గురూ!!!
బాలీవుడ్ లో షారూక్ ఖాన్ పట్టిందల్లా బంగారం అవుతోంది. చక్ దే, ఓం శాంతి ఓం సినిమాలు వరుసగా ఘనవిజయాలు సాధించాయి. ఇందులో ఓం శాంతి ఓం సినిమా స్వయంగా నిర్మించింది కావడం గమనించదగ్గ అంశం. ఇదిలా ఉంటే షారూక్ ఇంట మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. షారూక్ ఖాన్ భార్య గౌరీ ఇన్నాళ్లు ఇల్లాలుగా ఉంది. అందం విషయంలో ఆమేం తక్కువ తినలేదు. హీరోయిన్లకేమాత్రం తీసిపోదు. ఇద్దరు పిల్లల తల్లి కూడా అయిన గౌరీ యువ హీరోయిన్ లా మెరిసిపోతోంది. అందుకేనేమే ఇంట్లోనుంచి బయటకు రావడానికి గౌరీ సిద్ధపడింది. వోగ్ పత్రిక జనవరి ఎడిషన్ ముఖచిత్రంగా గౌరీ కనిపించబోతోంది. ఇది తన ప్రొఫేషన్ కానప్పటికీ చాలా కొత్తగా, వింతగా ఉందని చెబుతోంది. వోగ్ ఇండియా ఎడిటర్ ప్రియా తన్నా, గౌరీ ఖాన్ ను ఎందుకు ఎంచుకుందో కానీ గౌరీ మాత్రం అదిరిపోయిందని అంటోంది. రేపోమాపో మార్కెట్ లోకి రానున్న ఈ పత్రిక 2008వ సంవత్సరానికి ప్రత్యేకంగానే రూపుదిద్దుకుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











