ఫస్ట్ డే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ అంటే నమ్మలేకపోయా.. కొంత మందికి నచ్చలేదు.. చైతు!
అక్కినేని నాగ చైతన్య. యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం శైలజారెడ్డి అల్లుడు వినాయక చవితి పర్వదినాన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంత డివైడ్ టాక్ ఉన్నపటికీ ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. సీనియర్ హిరోయిన్ రమ్య కృష్ణ అత్త పాత్రలో నటించింది. రమ్య కృష్ణ పాత్ర కూడా ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సినిమాకి మంచి స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

నమ్మలేకపోయా
నాగ చైతన్య మాట్లాడుతూ.. తొలి రోజు శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి ఈరెంజ్ లో వసూళ్లు వచ్చాయంటే నమ్మలేకపోయా. తొలి రోజు సినిమా చూసి మంచి టాక్ అందించిన ఆడియన్స్ అందరికి కృతజ్ఞతలు అని చైతు తెలిపాడు.

మార్పుకి కారణం
ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు నాగచైతన్య చాలా ప్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎనెర్జిటిక్ గా కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసిస్తున్నారు. నా ఈ మార్పుకి కారణం దర్శకుడు మారుతినే అని చైతు తెలిపాడు. నటుడిగా ప్రతి సినిమాలో వైవిధ్యం కనబరచాలని భావిస్తా అని చైతు తెలిపాడు.

కొంత మందికి నచ్చలేదు
శైలజారెడ్డి అల్లుడు చిత్రం కొంత మందికి నచ్చలేదు. కొంత డివైడ్ టాక్, కొన్ని నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయని చైతు తెలిపాడు. తదుపరి చిత్రంతో అందరిని మెప్పించడానికి ప్రయత్నిస్తానని, ఇంకా బాగా కష్టపడతానని చైతు అన్నాడు.

అక్కినేని ఫాన్స్
దర్శకుడు మారుతి మాట్లాడుతూ అక్కినేని ఫాన్స్ మంచి మంచి ఎనర్జీ ఇచ్చారు. శైలజారెడ్డి చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది.మళ్ళీ మళ్ళీ చైతుతోనే సినిమా తీయాలనిపించే విధంగా శైలజారెడ్డి సంతృప్తిని ఇచ్చిందని మారుతి అన్నారు.


Click it and Unblock the Notifications