నాలాగే నీకూ ఇగో ఎక్కువని విన్నా.. దాని దమ్ము చూడాలని ఉంది.. శైలజారెడ్డి అల్లుడు అదరగొట్టాడు!
Recommended Video

అక్కినేని వారసుడు నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ అత్త పాత్రలో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. తాజగా ఈ చిత్ర ట్రైలర్ విడుదుల చేశారు. నాగచైతన్య స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ట్రైలర్ లో కావలసినన్ని ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.

నా పేరు చైతన్య
నా పేరు చైతన్య.. ముద్దుగా అందరు చైతు అని చైతు అంటారు.. దేనినైనా పాజిటివ్ గా తీసుకునే సాఫ్ట్ క్యాండిడేట్ ని అంటూ నాగచైతన్య ఇంట్రడక్షన్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పుట్టినపుడు డాడీ రూపంలో, ప్రేమించడానికి అను రూపంలో, పెళ్లి చేయడానికి అత్త రూపంలో దేవుడి ఇచ్చి నా జీవితాన్ని గట్టిగా తొక్కేశాడు అంటూ చైతు చెబుతున్న డైలాగులు బావున్నాయి.
అత్త, ప్రియురాలి మధ్య
అత్త, ప్రియురాలి మధ్య నలిగిపోయే యువకుడిగా చైతు కనిపిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, చైతు మధ్య కెమిస్ట్రీ బావుంది. ఒకరి పంతం ఒకరు నెగ్గించుకునే తల్లి కూతుళ్లుగా అను, రమ్యకృష్ణ కనిపిస్తున్నారు. నాలాగే నీకు కూడా ఇగో ఎక్కువని విన్నా.. దాని దమ్ము చూడాలని ఉంది అంటూ రమ్యకృష్ణ చెబుతున్న డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.

నవ్వులు పూయిస్తూ
ఇక కమెడియన్ పృథ్వి ఎప్పటిలాగే నవ్వులు పూయిస్తున్నాడు.రమ్యకృష్ణకు మేనేజర్ పాత్ర పోషిస్తూ తల్లీ కూతుళ్ళ మధ్య నలిగిపోతున్నాడు. మొత్తంగా శైలజారెడ్డి అల్లుడు చిత్రం వినోదాత్మక అంశాలతో తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

హలో బ్రదర్
ట్రైలర్ చివర్లో నాగార్జున హలొ బ్రదర్ చిత్రంలోని ప్రియరాగాలే సాంగ్ సంగీతం వినిపిస్తోంది. డాడీ ఫార్ములా వర్కౌట్ అయ్యేలా ఉందని చైతు డైలాగ్ చెబుతున్నాడు. సినిమా ఆధ్యంతం వినోదంతో నడిపిస్తూ హిట్ కొట్టడం దర్శకుడు మారుతి ఫార్ములా.


Click it and Unblock the Notifications











