మారుతితో పనిచేస్తే చేతిలో డెబిట్ కార్డు ఉన్నట్టే.. ఫ్యామిలీలు నిలబడుతాయి.. ఫృథ్వీ ఎమోషనల్
శైలజారెడ్డి అల్లుడు చిత్రం ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద యువసామ్రాట్ నాగచైతన్య, మారుతి కాంబినేషన్ లో రికార్డు కలెక్షన్లు వసూలుచేయబోతున్న సందర్భంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో యువసామ్రాట్ నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ మారుతి, నరేష్, 30 ఇయర్స్ పృధ్వి, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి, నిర్మాత నాగవంశి పాల్గొన్నారు.
యువసామ్రాట్ నాగచైతన్య , అను ఇమాన్యూల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణ లో నాగవంశి.ఎస్, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన హిలేరియస్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ శైలజారెడ్డి అల్లుడుకి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవుతున్నది. .
ఈ చిత్రం వినాయకచవితి సంధర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మెదటిరోజు 12 కోట్లు వసూలు చేయ్యటమె కాకుండా మూడురోజులకి దాదాపు 23 కోట్ల రూపాయిలు వసూలు చేసి పీపుల్స్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.

సక్సెస్ మీట్ లో నటుడు పృథ్వీ మాట్లాడుతూ... సినిమా థియేటర్లో చూశాను. జనాలు ఫుల్ ప్యాక్ డ్ గా ఉన్నారు. డైరెక్టర్ మారుతి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రకాలుగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి కుటుంబం, హ్యూమన్ రిలేషన్స్, ఇగోల గురించి చక్కగా చెప్పారు.
ఈగోయిస్ట్ క్యారెక్టర్లో అను కరెక్ట్ గా సరిపోయారు. నాగ చైతన్య గారు సూపర్బ్ పెర్ ఫార్మెన్స్. కొన్ని చోట్ల నాగార్జున గారు కనిపిస్తున్నారని రివ్యూస్ లో రాశారు. క్యారెక్టర్లో లీనమై నటించారు. నరేష్ గారు ఉంటే షూటింగ్ సరదాగా జరిగేది. కామెడీగా స్ఫూఫులు చేసే నాకు మారుతి బాబు బంగారంలో మంచి పాత్ర ఇచ్చారు.
ఇప్పడు శైలజా రెడ్డిలో మాణిక్యం అనే క్యారెక్టర్ ఇచ్చారు. చాలా మంది ఇలాగే కంటిన్యూ చేయి అంటున్నారు. మా నిర్మాత వంశీకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మారుతి గారి దగ్గర పనిచేస్తే డెబిట్ కార్డ్ వచ్చినట్టే. డైరెక్టర్, బ్యానర్ నిలబడితే చాలా ఫ్యామిలీస్ నిలబడతాయి. రమ్యకృష్ణ గారు అద్భుతంగా నటించారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











