బికినీకి సై అన్న రామ్ చరణ్ హీరోయిన్
రామ్ చరణ్ తేజతో 'ఆరంజ్'లో కనిపించి అలరించిన షాజన్ పదమ్సీ గుర్తుండే ఉంటుంది. ఆమె త్వరలో బికినీలో కనిపించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం 'హౌస్‌ఫుల్-2' చిత్రంలో షాజన్ నటిసున్నారు. ఈ సినిమాలో సన్నివేశానుగుణంగా బికినీలో కనిపించడానికి ఆమె ఓకే చెప్పింది.
ఈ విషయం గురించి ఆమె మీడియాకు చెబుతూ -'' కేవలం గ్లామర్ కోసం,ఆఫర్స్ కోసం నేను బికినీ వేయడం లేదు. సీన్ డిమాండ్ మేరకే బికినీ వేస్తున్నాను. అయితే ఈ బికినీలో నేను గ్లామర్‌గా కనిపిస్తాను తప్ప అసభ్యంగా కనిపించను. ఆ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాను. ఇంతకు ముందు కనిపించిన బికినీ భామలకు భిన్నంగా, కొత్తగా ఇందులో కనిపిస్తాను. బికినీతో కుర్రకారుని కచ్చితంగా కట్టిపడేస్తానని నమ్మకం ఉంది'' అని చెప్పుకొచ్చింది.
ఇక 'ఆరంజ్' తర్వాత సౌత్‌లో అవకాశాలు ఎక్కువగానే వచ్చాయి. మనసుకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో 'ఓకే' చెప్పలేదు. తమిళంలో 'కనిమొళి' అనే సినిమా చేశాను. అక్కడ బాగా ఆడింది. తెలుగులో 'లవ్‌జర్నీ'గా విడుదల కానుంది. తెలుగులో కూడా మంచి సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నాను అంది.


Click it and Unblock the Notifications











