ఎవడు బే ఆడు.. మీకు రావేంట్రా రోగాలు.. రూమర్లపై షకలక శంకర్ ఒక రేంజ్‌లో, ఒకటే ఫోన్లు!

జబర్దస్త్ తో షకలక శంకర్ బాగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో శంకర్ కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకున్నాడు. సెలెబ్రిటీల గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ప్రచారం జరుగుతుంటాయి. చాలా పుకార్లని సెలెబ్రిటీలు పట్టించుకోకుండా వదిలేస్తారు. కొన్ని రూమర్లు మాత్రం ఆ సెలెబ్రిటీ కుటుంబాన్ని, స్నేహితులని బాధించే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి పుకార్లే షకలక శంకర్ గురించి వైరల్ అవుతున్నాయి. తనపై వస్తున్న రూమర్లపై శంకర్ తనదైన శైలిలో స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఓ వీడియో ద్వారా తాను బాగానే ఉన్నానని తెలిపాడు.

 ఏదో అయిపోయింది అంటూ

ఏదో అయిపోయింది అంటూ


తనకు ఎదో అయిపోయిందంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై షకలక శంకర్ తో పాటు గెటప్ శీను కూడా స్పందించాడు. వీరిద్దరూ ఓ వీడియో బైట్ ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. గెటప్ శీను ఈ వీడియోలో మాట్లాడుతూ.. నాకు ఉదయం నుంచి ఫోన్లమీద ఫోన్లు వస్తున్నాయి. షకలక శంకర్ కు హార్ట్ అటాక్ అని, ఇంకేదో అయిపోయిందని కంగారు పడుతూ మా స్నేహితులంతా ఫోన్ చేస్తున్నారు అని గెటప్ శీను తెలిపాడు.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో


షకలక శంకర్ గురించి వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా విభాగాల్లో ఈ ప్రచారం జరుగుతోంది. శంకర్ కు ఏదో అయిపోతే మరి ఇతను ఎవరు అంటూ తన పక్కనే నిక్షేపంలా ఉన్న శంకర్ ని గెటప్ శీను చూపించాడు. శంకర్ మాట్లాడుతూ.. ఎవడు బే ఆడు ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసింది అని ఘాటుగా మాట్లాడాడు. శంకర్ మాట్లాడుతుండగా గెటప్ శీను మధ్యలో కల్పించుకుని ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

గతంలో కూడా ఇలాగే

గతంలో కూడా ఇలాగే

ఈ రోజు షకలక శంకర్ మ్యారేజ్ యానవర్సరీ. ఈ రోజు అతడి కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి. కానీ అందరిని ఇబ్బంది పెట్టేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. గతంలో కూడా రంగస్థలం ఫేమ్ మహేష్ పుట్టినరోజునే అతడికి ఏదో అయిపోయింది అంటూ ప్రచారం జరిగింది అని గెటప్ శీను తెలిపాడు. దయచేసి ఇలాంటి రూమర్లు సృటించవద్దని గెటప్ శీను కోరాడు.

మీకు రావేంట్రా రోగాలు

మీకు రావేంట్రా రోగాలు

శంకర్ మాట్లాడుతూ.. తన గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వాళ్లపై విరుచుకుపడ్డాడు. మీకు రావేంట్రా రోగాలు.. ఎక్కడి నుంచి వచ్చార్రా మీరంతా.. మా పని మమ్మల్ని ప్రశాంతంగా చేసుకోనివ్వండ్రా అని వార్నింగ్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X