పవన్ ‘ఐటెం గర్ల్‌’తో షకలక శంకర్.. జోరులో డ్రైవర్ రాముడు!

By Rajababu

కమెడియన్ గానే కాకుండా హీరో గా కూడా దూసుకుపోతున్న మన నవ్వుల వీరుడు షకలక శంకర్ . తాను హీరో గా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా డ్రైవర్ రాముడు సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. నానక్‌రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్‌లో భారీ సెట్లో ఐటమ్ సాంగ్‌లో నటించాడు. ఈ పాటలో కెమెరామెన్ గంగతో రాంబాబు,రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు, ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన బాహుబలి లాంటి సినిమాలో తన అంద చందాలతో ఉరూతలూగించిన స్కార్లెట్ విల్సన్‌తో షకలక శంకర్ ఐటెం సాంగ్‌కి చిందులేశాడు. యువతని ఉరూతలూగించే ఈ ఐటెం సాంగ్‌కి శివ శంకర్ మాస్టర్ నృత్యం సమకూర్చారు.

 హీరోగా నా రెండో సినిమా

హీరోగా నా రెండో సినిమా

ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ "హీరో గా నా మొదటి సినిమా శంభో శంకర ని విజయం చేసిన ప్రతిఒక్కరికి నా కృతఙ్ఞతలు. హీరోగా డ్రైవర్ రాముడు నా రెండో సినిమా. మొదటి సినిమా శంభో శంకర కన్నా చాలా అద్భుతంగా వస్తుంది. ఈ సినిమా మీ అంచనాలకు మించి ఉంటుంది. నిర్మాతలు, దర్శకుడు ఎక్కడ దేనికి వెనుకాడకుండా సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఐటెం సాంగ్ చేస్తున్నాం. ఎన్నో సినిమాలకి పనిచేసిన శివ శంకర్ మాస్టర్ గారి దర్శకత్వం లో ఈ ఐటెం సాంగ్ చేయటం నాకు చాలా సంతోషం. ఈ సినిమా తో అందరిని అలరిస్తానని నమ్మకం నాకుంది" అని తెలిపారు.

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు

డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాట్లాడుతూ "తమిళంలో చాలా సినిమాలు చేసినా తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. తెలుగు సినిమాల వల్లే నాకు ఇంత మంచి పేరు వచ్చింది. నేను ఇప్పుడు హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యాను. ఈ పాట నాకిచ్చిన దర్శక నిర్మాతలకి నా కృతజ్ఞతలు. చాల మంచి పాట చాలా బాగా వస్తుంది" అని తెలిపారు.

ఐటెం సాంగ్ చేయడం

ఐటెం సాంగ్ చేయడం

స్కార్లెట్ విల్సన్ మాట్లాడుతూ "మళ్లీ తెలుగు సినిమా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రైవర్ రాముడు‌లో ఐటెం సాంగ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. శివశంకర్ మాస్టర్ నా కెరీర్‌లో బెస్ట్ కొరియోగ్రాఫేర్. అయ్యన దగ్గర చాలా నేర్చుకున్నాను. దర్శకుడు నిర్మాతకి నా కృతజ్ఞతలు" అని తెలిపారు.

ఆ డ్రైవర్ రాముడికి తగ్గకుండా

ఆ డ్రైవర్ రాముడికి తగ్గకుండా

దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ "డ్రైవర్ రాముడు అనేదే పెద్ద ఎన్ టీ ఆర్ గారి సినిమా టైటిల్. ఆ సినిమా కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు, ఈ సినిమా కూడా అంత విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాము. పెద్ద పెద్ద సినిమాలో నటించిన స్కార్లెట్ విల్సన్ మా సినిమా లో ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ పాటకి శివ శంకర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. షకలక శంకర్ నటన, కథ, కథాంశం అద్భుతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది" అని అన్నారు

శంభో శంకరకు మించి

శంభో శంకరకు మించి

నిర్మాతలు మాట్లాడుతూ "షకలక శంకర్ గారి శంభో శంకర సినిమాకి మించి మా డ్రైవర్ రాముడు సినిమా ఉంటుంది. పాటలు చాలా బాగా వస్తున్నాయి. ఈ పాట కి శివ శంకర్ మాస్టర్ కోరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. సునీల్ కాశ్యప్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు.

 తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: షకలక శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా తదితరులు

బ్యానర్- సినిమా పీపుల్స్
సమర్పణ - మాస్టర్ ప్రణవ్ తేజ్
మ్యూజిక్ - సునీల్ కశ్యప్
ఆర్ట్ - రఘు కులకర్ణి
డిఓపి - అమర్ నాథ్
నిర్మాతలు - కే వేణు గోపాల్ , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్
దర్శకత్వం - రాజ్ సత్య

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X