కక్కలేక మింగలేక ఆర్జీవితో మాట్లాడిన షకలక శంకర్.. పవర్ స్టార్ సినిమాపై పాజిటివ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన షకలక శంకర్ ఆర్జీవిని ఇమిటేట్ చేసి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే పరాన్నజీవి vs పవర్ స్టార్ అని వివాధాలు నడుస్తున్న సమయంలో మొదటిసారి ఒక లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. అయితే షకలక శంకర్ ఆ ఇంటర్వ్యూలో కక్కలేక మింగలేక ఆర్జీవితో మాట్లాడినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్జీవిగా షకలక శంకర్..
వర్మ పవన్ కళ్యాణ్ పై తీసిన సెటైరికల్ మూవీ పవర్ స్టార్ సినిమాకు కౌంటర్ గా పరాన్న జీవి అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మగా షకలక శంకర్ నటిస్తున్నాడు. అయితే ఇటీవల లైవ్ ఇంటర్వ్యూలో వీరిద్దరు మాట్లాడుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్జీవి గారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా..
ఆ ఇంటర్వ్యూలో శంకర్ ఒక వైపు తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెబుతూనే.. మరోవైపు ఆర్జీవి గారి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని వివరణ ఇచ్చాడు. శంకర్ మాట్లాడుతూ.. ఆర్జీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నాకు ఇష్టమే. ఓ విధంగా ఆర్జీవిగారు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. నిజంగా ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే కూడా చాలా ఇష్టం.

పవర్ స్టార్ సినిమా కూడా అలానే తీశారు..
ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ ఓ విధంగా ఈ లాక్ డౌన్ లో ఆర్జీవి గారు చాలా మందికి పని కల్పిస్తున్నారు. ఎదో ఒక విదంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. పవర్ స్టార్ సినిమా కూడా అలానే తీశారు. ఇక ఆర్జీవి గారు నన్ను చాలా ఇష్టపడతారు. సత్య 2 సినిమా ఈవెంట్ లో నన్ను స్పెషల్ గా పిలిపించారు. ఆయనను ఇమిటేట్ చేయమని 50వేలు కూడా ఇచ్చారు.

ఆ సినిమా చూసి జ్వరం వచ్చింది
అయితే వర్మ గారి నుంచి గతంలో మాదిరిగా మంచి సినిమాలు రావడం లేదు. నాకు చిన్నప్పుడు దెయ్యం సినిమా చూసి జ్వరం వచ్చింది. ఆ సినిమా వాల్యూ నాకు పెద్దయ్యాక అర్దమయ్యింది. ఇక సత్య, శివ, సర్కార్, రాంగీలా వంటి ఎన్నో మంచి మంచి సినిమాలు తీసిన ఆర్జీవి ప్రస్తుతం అలాంటి సినిమాలు చేయడం లేదనే బాధ ఉందని శంకర్ వివరణ ఇచ్చాడు.
Recommended Video

షకలక శంకర్ పై RGV కామెంట్..
ఇక షకలక శంకర్ చేసిన కామెంట్స్ పై పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఆర్జీవి. నేను ఒకరిపై ఇష్టం ఉన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నప్పుడు తనపై ఎవరైనా కామెంట్ చేసే హక్కు ఉంది. ఎవరు ఏం చేసినా కూడా నాకు తిట్టే హక్కు లేదు. అది వాళ్ళ ఇష్టం. కానీ నేను మాత్రం అనుకున్నది చేస్తాను. ఇక షకలక శంకర్ పై కూడా తనకు ఎలాంటి కోపం లేదని ఆర్జీవి వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











