పరాన్నజీవిలో ఆర్జీవిగా స్టార్ కమెడియన్.. వర్మకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.. ఫస్ట్ లుక్ వైరల్

పవర్ స్టార్ నేమ్ తో ఓటీటీ బిజినెస్ ని క్యాష్ చేసుకోవాలని విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అసలు వర్మ ఈ సినిమాను ఎందుకు తీస్తున్నాడు అనే విషయంలో ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక మరోవైపు ఆయనకు కౌంటర్ గా పవన్ అభిమానుల బ్రాండ్ తో పరాన్నజీవి సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అందులో ఆర్జీవిగా ఒక స్టార్ కమెడియన్ కనిపించబోతున్నాడు.

 ట్రైలర్ తో మరింత హైప్

ట్రైలర్ తో మరింత హైప్

ఇప్పటికే వర్మ పవర్ స్టార్ కి సంబంధించిన పోస్టర్స్ తో చాలా వరకు వైరల్ అయ్యేలా చేశారు. ఇక రీసెంట్ గా సినిమా పాటతో మరికొంత హైప్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్ తో మరింత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు సినిమాకి సంబంధించిన అన్ని పాత్రలను లీక్ చేశాడు వర్మ.

ఆర్జీవి పాత్రలో షకలక శంకర్

ఆర్జీవి పాత్రలో షకలక శంకర్

ఇక పరాన్న జీవిలో ఆర్జీవిగా ఎవరు కనిపించనున్నారు అనే ఊహాగానాలకు చిత్ర యూనిట్ ఎండ్ కార్డ్ పెట్టేసింది. రామ్ గోపాల్ వర్మగా స్టార్ కమెడియన్ షకలక శంకర్ కనిపించనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. గతంలో జబర్దస్త్ లో శంకర్ ఆర్జీవిని ఇమిటేట్ చేసి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

 కౌంటర్ ఇవ్వడానికి..

కౌంటర్ ఇవ్వడానికి..

సత్య 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వర్మ ముందే శంకర్ ఆర్జీవిగా కనిపించి ఆయనను సర్ ప్రైజ్ చేశాడు. ఇక నిజానికి శంకర్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ఆర్జీవి పవర్ స్టార్ ఇమేజ్ పై సెటైర్స్ వేస్తుండడంతో కౌంటర్ ఇవ్వడానికి షకలక శంకర్ ఈ విధంగా ఉపయోగపడుతున్నాడు.

 వారు కూడా స్పెషల్ పాత్రలలో..

వారు కూడా స్పెషల్ పాత్రలలో..

షకలక శంకర్ తో పాటు మరికొందరు ఫేమస్ ఆర్టిస్టులు పరాన్న జీవిలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఐ డ్రీమ్ TNRతో పాటు కత్తి మహేష్, అలాగే టీవి9 జాఫర్ కూడా పరాన్న జీవిలో ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమా జులై 25న శ్రేయస్ ETలో రిలీజ్ కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X