శకలక శంకర్ హీరోగా ‘డ్రైవర్ రాముడు’... ఫస్ట్ లుక్ సూపర్
శకలక శంకర్ హీరోగా సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి ‘డ్రైవర్ రాముడు’ టైటిల్ ఖరారైంది.
Recommended Video

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన శకలక శంకర్ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తూ వరుస అవకాశాలతో దూసుకెలుతున్నాడు. తాజాగా శకలక శంకర్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి 'డ్రైవర్ రాముడు' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ పతాకం పై మాస్టర్ రాజ్ ప్రణవ్ తేజ్ సమర్పణలో ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ నిర్మిస్తున్నారు. పోస్టర్ కట్టుకునే విధంగా ఉండటంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మంచి కథతో పాటు శంకర్ మార్క్ కామెడీ
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన శంకర్‌లో మరో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంకర్ మార్క్ కామెడీ ఉంటూనే ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.

అన్నగారి సినిమా పేరును దుర్వినియోగం చేయడం లేదు
డ్రైవర్ రాముడు చిత్రం అనగానే నందమూరి తారక రామారావు గారు మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రాల్లో డ్రైవర్ రాముడు ఒకటి. అలాంటి చిత్రం టైటిల్ వేరే చిత్రాలకి పెట్టాలంటే ఆ చిత్రం కూడా ఆ రేంజి కంటెంట్ కాకపోయినా పర్వాలేదు కాని ఆ టైటిల్ ని దుర్వినియోగం చెయ్యకూడదు. తమ చిత్రం అన్నగారి సినిమా పేరును ఏమాత్రం చెడగొట్టబోదు అని దర్శకుడు అంటున్నారు.

హీరోగా కూడా ఆదిస్తారించాలని కోరుతున్న శంకర్
హీరో శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటివరుకు కమెడియన్‌గా నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు. ఇపుడు హీరోగా కూడా ఆదిస్తారని, ఆశీర్వదిస్తారని నమ్ముతాను. నా కామెడీ టైమింగ్ ఏ మాత్రం మిస్ కాకుండా థియేటర్ కి వచ్చే ప్రతి ఆడియెన్ కడుపుబ్బా నవ్వుకునేలా డైవర్ రాముడు తెరకెక్కుతుంది. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని తీస్తున్న దర్శకుడుకి నిర్మాతలకి నా ప్రత్యేఖ ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

ఆ టైటిల్ వల్ల సక్సెస్ వచ్చినట్లే
నిర్మాతలు ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ మాట్లాడుతూ... తెలుగు ప్రజల దేవుడు ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ డ్రైవర్ రాముడు టైటిల్ ని మళ్లీ తమ సినిమాకి పెట్టుకోవడం తొలి సక్సెస్ గా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సినిమా అందరినీ బాగా నవ్విస్తుందన్నారు.

నటీనటులు, టెక్నీషియన్స్
ఈ చిత్రంలో శంకర్ ప్రదీప్ రావత్, తాగుబోతు రమేశ్, అదుర్స్ రఘు, నల్లవేణు, లోబో నటిస్తున్నారు.
బ్యానర్- సినిమా పీపుల్
సమర్పణ - మాస్టర్ ప్రణవ్ తేజ్
మ్యూజిక్ - సునీల్ కశ్యాప్
ఆర్ట్ - రఘు కుల్ కర్ణి
డిఓపి - అమర్ నాథ్
నిర్మాతలు - ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్
దర్శకత్వం - రాజ్ సత్య


Click it and Unblock the Notifications











