For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya: ఈవెంట్‌లో షాకింగ్ సీన్.. స్పీచ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన కమెడియన్లు.. అవాక్కైన సుమ

  |

  సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతోన్నారు బాస్ మెగాస్టార్ చిరంజీవి. తనలోని అన్ని కోణాలను చూపిస్తూ ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇక, రీఎంట్రీలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' అనే మూవీతో రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇందులో షకలక శంకర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరిలు యాంకర్ సుమకు షాకిచ్చారు. ఆ సంగతులు మీకోసం!

  వాల్తేరు వీరయ్యగా మారిన చిరు

  వాల్తేరు వీరయ్యగా మారిన చిరు

  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో వస్తున్న ఎంటర్‌టైనర్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.

  49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన హీరోయిన్: అది డ్రెస్సా? చేపలు పట్టే వలా?

  గ్రాండ్ రిలీజ్... అంతటా హవా

  గ్రాండ్ రిలీజ్... అంతటా హవా

  భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, చాలా చోట్ల అప్పుడే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. విడుదలకు నెల ముందు నుంచే ఈ చిత్రం హవా చూపిస్తోంది.

  వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ పార్టీ

  వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ పార్టీ

  క్రేజీ కాంబోలో వస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీ రిలీజ్‌కు రెడీ అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవంగా జరుగుతోన్న ఈ వేడుకకు మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరవడంతో సందడిగా ఉంది.

  బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  కమెడియన్లతో సుమ ఆటలు

  కమెడియన్లతో సుమ ఆటలు


  వైజాగ్‌లో ఎంతో గ్రాండ్‌గా జరుగుతోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కమెడియన్లు షకలక శంకర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరిలు హాజరయ్యారు. వీళ్లతో యాంకర్ సుమ ఓ ఆట ఆడుకుంది. అంతేకాదు, ఎల్‌ఈడీ స్క్రీన్‌పై చిరంజీవి పోస్టర్లు వేసి దానికి సంబంధించిన డైలాగులు చెప్పాలని చెప్పింది. ఈ గేమ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా, ఎంతో సందడిగా సాగింది.

  ఒక్కొక్కరికీ 20 సెకెన్లు మాత్రమే

  ఒక్కొక్కరికీ 20 సెకెన్లు మాత్రమే

  'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇవ్వకముందే అక్కడకు వచ్చిన గెస్టులతో సుమ మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ఆమెతో కలిసి గేమ్ ఆడిన ముగ్గురు కమెడియన్లు షకలక శంకర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరిలను ఒక్కొక్కరు 20 సెకెన్ల చొప్పున మాత్రమే మాట్లాడాలని కండీషన్ పెట్టింది.

  Kajal Aggarwal: గ్లామర్ కంచె తెంచేసిన కాజల్.. బ్లేజర్ తీసేసి మరీ హాట్ షో

  మాట్లాడము అంటూ వెళ్లిపోయి

  మాట్లాడము అంటూ వెళ్లిపోయి

  యాంకర్ సుమ తమను ఒక్కొక్కరిని 20 సెకెన్లు మాత్రమే మాట్లాడాలని చెప్పడంతో షకలక శంకర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరిలు స్పీచ్ ఇవ్వమంటూ చెప్పి షాకిచ్చారు. అప్పుడు వాళ్లు తర్వాత మాట్లాడతామని అన్నారు. కానీ, సుమ మాత్రం తర్వాత కుదరదు అని చెప్పింది. దీంతో ఆ ముగ్గురూ 'ఇప్పుడు కాకపోతే మరో ఈవెంట్‌లో మాట్లాడతాం' అంటూ కిందకు దిగి వెళ్లిపోయారు.

  చూశారా ఇలా తయారయ్యారు

  చూశారా ఇలా తయారయ్యారు


  ఆ ముగ్గురు కమెడియన్లు షకలక శంకర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి మాట్లాడకుండానే స్టేజ్ నుంచి కిందకు దిగి వెళ్లిపోవడంతో యాంకర్ సుమ అవాక్కయింది. అప్పుడామె 'చూశారా వీళ్లు ఎలా తయారయ్యారో? ఇప్పుడు మాట్లాడరంట.. మరో ఈవెంట్‌లో మాట్లాడుతున్నాం అంటున్నారు' అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ సంఘటన వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో హాట్ టాపిక్ అయింది.

  English summary
  Chiranjeevi Waltair Veerayya Movie Unit Conducts Pre Release Event At AU Grounds. Shakalaka Shankar, Sapthagiri and Srinivasa Reddy Shocks Anchor Suma at this Event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X