మంచి రేటుకి షకలక శంకర్ శంభో శంకర రైట్స్ !
జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించిన కొద్దిమందిలో షకలక శంకర్ ఒకరు. తక్కువ సమయంలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా శంబో శంకర సినిమా రూపొందుతోంది.. ఇటీవలే ఈ మూవీ ఫ్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. . పవర్ ఆఫ్ శంకరా అంటూ బ్యాక్ డ్రాప్ లో ఒక టెంపుల్, త్రిశూలం ఈ ప్రీ లుక్ ఫోటోలో ఉన్నాయి. పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించడం జరిగింది.
శంభో శంకర సినిమాతో నూతన దర్శకుడు శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ 55 లక్షలకు అమ్మినట్లు సమాచారం. యంగ్ టీం వర్క్ చేసిన ఈ సినిమా మంచి రేటుకు అమ్ముడుపోవడం విశేషమే.

షకలక శంకర్ ఎన్నో కథలు విన్న తర్వాత ఈ సబ్జెక్టు ను ఒకే చేసినట్లు సమాచారం. ఈ కథ తనకు బాగా సెట్ అవుతుందని షకలక శంకర్ భావించి సినిమాను మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రేక్షకులు షకలక శంకర్ ను హీరోగా కూడా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాడు. త్వరలో విడుదల తేదిని ప్రకటించబోతున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ సంగీతం అందించగా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసారు.


Click it and Unblock the Notifications











