త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు శిరీష్ పై షకలక శంకర్ సంచలన వ్యాఖ్యలు.. రవితేజ గడి పెట్టి మరీ!
Recommended Video

జబర్దస్త్ లో కమెడియన్ గా పాపులర్ అయిన షకలక శంకర్ ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్నాడు. కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో శంకర్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం శంభో శంకర. జూన్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని జోరుగా నిర్వహిస్తోంది. మీడియా సమావేశంలో షకలక శంకర్ మాట్లాడుతూ త్రివిక్రమ్, అల్లు శిరీష్, దిల్ రాజు, రవితేజ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

త్రివిక్రమ్ వద్దకు వెళితే
శంభో శంకర కథ తీసుకుని త్రివిక్రమ్ వద్దకు వెళ్లాలని శంకర్ తెలిపాడు. అప్పటికి తాను త్రివిక్రమ్ అ.. ఆ చిత్రంలో చిన్న పాత్రలో నటించానని శంకర్ తెలిపాడు. తనవద్ద ఓ కథ ఉందని హీరోగా నటిస్తున్నాని చెబితే.. నువ్వు హీరోనా అని త్రివిక్రమ్ ఆశ్చర్యంగా అడిగారు.

అజ్ఞాతవాసిలో పాత్ర ఇస్తానని
ఈ కథకు మీరు 2 కోట్లు డబ్బు పడితే సినిమా చేస్తానని, 8 కోట్లు తిరిగి వస్తాయని కూడా చెప్పానని శంకర్ తెలిపాడు. కానీ ఆయన మాత్రం నీదేవుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో అదిరిపోయే పాత్ర ఇస్తానని చెప్పారు. కానీ అజ్ఞాతవాసి చిత్ర షూటింగ్ మాత్రం అయిపోయింది.. నాకు మాత్రం ఫోన్ రాలేదని తెలిపాడు.

దిల్ రాజు హాస్పిటల్ లో ఉంటే
కథ తీసుకుని దిల్ రాజు గారి దగ్గరకు వెళ్ళా. ఆయన చేయి నొప్పి కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన వద్దకు వెళితే తరువాత చిత్రంలో వేషం ఇస్తానని అన్నారు. తాను అందుకు రాలేదు అని ఓ చిత్రంలో హీరోగా నటించబోతున్నా.. దానికి డబ్బు పెట్టాలని కోరా. ఇప్పుడు చాలా చిత్రాలు చేస్తున్నా.. తరువాత చేద్దాంలే అని దిల్ రాజు అన్నట్లు శంకర్ తెలిపాడు.

అల్లు శిరీష్ కూడా అదే మాట
అల్లు శిరీష్ కు ఈ కథగురించి చెబితే ఇప్పటికే తాను ఓ చిత్రానికి కమిటై ఉన్నానని ఇప్పుడు కుదరదని అన్నారు. హీరో మీరు సర్ నేను అని చెప్పా. ఈ విషయం మానాన్నకు తెలిస్తే నా సినిమాకు కూడా డబ్బులు పెట్టాడు. తరువాత చూద్దాంలే అన్నారు.

రవితేజ గడి పెట్టి మరీ
ఈ విషయం గురించి రవితేజ వద్దకు వెళితే ఆయన రూమ్ లోనికి తీసుకుని వెళ్లి గడి పెట్టి మరీ మాట్లాడారు అని అన్నారు. ఇప్పుడు నీవు హీరోగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. తన అభిప్రాయాన్ని చెబితే 20 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్లు ఉందని రవితేజ అన్నారు. సినిమా తరువాత చేద్దాంలే అని అన్నారు.

ఆయన మాత్రమే
నా కష్టాన్ని, నా దర్శకుడు శ్రీధర్ కష్టాన్నీ ఎక్కడో నెల్లూరులో ఉన్న రమణారెడ్డి అర్థం చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారని శంకర్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











