డైరెక్టర్ తేజ ఫోన్ చేసి అలా అనడంతో ఏడ్చేశా.. అసలు విషయం చెప్పిన షకీలా
హీరోయిన్, నటి, శృంగార తార షకీలా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు వెండితెరపై యువతకు ఆరాధ్య దైవంలా ఓ వెలుగు వెలిగింది. షకీలా సినిమా వస్తోందంటే.. స్టార్ హీరోలు కూడా వెనక్కి వెళ్లిపోయేవారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని భాషల్లో షకీలా తన సత్తాను చాటుకుంది. సినీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో.. వ్యక్తిగత జీవితం అంత దుర్భరంగా మారింది. అలాంటి షకీలా ఇప్పుడు అంతగా అవకాశాలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటుంది.

కుటుంబ సభ్యులే..
షకీలా ఎంత బిజీగా ఉన్నా.. ఎంత సంపాదించినా కూడా.. ఎంతటి స్టార్డంను అనుభవించినా కూడా ఇప్పుడు అవేమీ ఉపయోగపడటం లేదు. తన సంపాదన మొత్తం అక్క, అమ్మ చేతుల్లోనే ఉండేదని, తాను ఎంత సంపాదిస్తున్నానో కూడా తెలియదని షకీలా చెప్పుకొచ్చింది. చివరకు అందరూ కలిసి మోసం చేసేశారని షకీలా చెబుతూ ఉంటుంది.

డబ్బంతా కూడా..
తాను సంపాదించిన డబ్బు, ఆస్తులు అన్నీ కూడా కుటుంబ సభ్యుల కోసమే వాడారు.. అందరూ తన డబ్బులు వాడుకున్నారు కానీ ఏ ఒక్కరూ కూడా నన్ను పట్టించుకోరు.. పైగా నన్ను అసహ్యంగా చూస్తు అవమానిస్తూ ఉంటారని షకీలా తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి పేర్కొంది. ఇలా ఎన్నో ఇంటర్వ్యూల్లో తాను ఎలా మోసపోయాను.. ఎలా మోసం చేశారో అన్న విషయాలను బయటపెట్టేసింది.

తాజాగా అలా..
అయితే తాజాగా షకీలా అలీ నిర్వహిస్తోన్న టాక్ షోలో పాల్గొంది. అందులో దర్శకుడు తేజ గురించి చెప్పుకొచ్చింది. కరోనా సమయంలో తనకు ఫోన్ చేశాడని, ఆయన అన్న మాటలకు ఏడ్చేశానంటూ షకీలా ఎమోషనల్ అయింది. ఈ మేరకు షకీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

అలా అన్నారు..
డైరెక్టర్ తేజగారూ నాకు కాల్ చేసి 'ఏమ్మా బాగానే ఉన్నావా, డబ్బులుకేమైనా ఇబ్బంది పడితే చెప్పు పంపుతాను' అంటూ మాట్లాడారు. అప్పుడు నేను బాగా ఏడ్చేశాను. సార్ నా గురించి అంతలా పట్టించుకున్నారా! ఎందుకంటే నా తమ్ముడు సలీమ్ ఆ టైంలో ఏ రోజూ ఫోన్ చేసి పలకరించలేదు. తేజగారు లాంటి పెద్ద డైరెక్టర్ నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడగటమంటే మామూలు విషయం కాదు. ఆయనకు బాగా ఇష్టమైన వాళ్లలో కొంతమందికే అలా కాల్ చేసి మాట్లాడారట. నిజంగా నాకు చాలా సంతోషమేసిందని షకీలా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











