ఆస్తులన్ని అమ్మేసి ఈ సినిమాపైనే పెట్టాను.. దయచేసి మగాళ్లు మాత్రమే చూడండి.. షకీలా ఆవేదన
ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన నటి షకీలా. మలయాళంలో ఆమె ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పలు కారణాల వల్ల మెల్లగా ఆర్థికంగా నష్టపోయిన ఆమె చాలా కాలం తరువాత ఒక సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. నష్టాల నుంచి తప్పించుకోలేక ఆమె డిజిటల్ వరల్డ్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆడియేన్స్ కి ఒక వివరణ ఇచ్చారు.

మగవాళ్లకు మాత్రమే..
లేడీస్ నాట్ అలౌడ్ అనే ఒక అడల్ట్ సినిమాను నిర్మించిన షకీలా ఊహించని విధంగా సమస్యల్లో పడింది. గత ఏడాదిలో ఈ సినిమాపై ఆమె కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మగవాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడాలని హై రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. ఇక లాక్ డౌన్ కి ముందు సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్న సమయంలో సెన్సార్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.

సెన్సార్ దొరకలేదు..
షకీలా మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కి రావాలని అనుకున్నాను. కానీ లాక్ డౌన్ వల్ల కుదరలేదు. ఫిల్మ్ తీసి దాదాపు రెండేళ్లు అవుతోంది. 3 నెలల్లోనే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కానీ సెన్సార్ పనులు పూర్తి చేయడానికి ఏడాది సమయం పట్టింది. సెన్సార్ కోసం హైదరాబాద్, చెన్నై, బాంబే, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్ళాము. కానీ సెన్సార్ దొరకలేదు.

నా సేవింగ్స్ దీనిపైనే పెట్టాను..
ఆ గోడవలతో సతమతమవుతుండగా సడన్ గా కరోనా వచ్చి మరిన్ని ఇబ్బందులకు గురి చేసింది. నేను దాచుకున్న డబ్బు సేవింగ్స్ ఈ సినిమాపైనే పెట్టాను. ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. వడ్డీకి అప్పులు చేశాను. వడ్డీ డబ్బులు తరువాత ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పినా కూడా అప్పులు ఇచ్చిన వారు ఉరుకోవడం లేదు. దీని వల్ల ఒత్తిడికి లోనవుతున్నాము.
Recommended Video

సినిమా టికెట్ ధర రూ.50 మాత్రమే
ఈ మధ్య కాలంలో సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయవచ్చని తెలుసుకున్నాను. అందుకే సినిమా టైటిల్ తోనే వెబ్ సైట్ క్రియేట్ చేసి అందులో సినిమాను రిలీజ్ చేస్తున్నాము. టికెట్ ధర 50రూపాయలు మాత్రమే. ఇది ఒక అడల్ట్ సినిమా మాత్రమే. లేడీస్ ఈ సినిమా చూడవద్దు. మగవాళ్లకు మాత్రమే. దయచేసి ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించండి. మేము నెక్స్ట్ సినిమా తిస్తామో లేదో తెలియదు గాని ఇప్పటికైతే బ్రతికిపోతాము అంటూ షకీలా తన వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











