అనారోగ్యంతో హాస్పిటల్ లో షకీలా.. సినిమా చూస్తే బ్రతికిపోతాను అంటూ..
ఒకప్పటి బి గ్రేస్ యాక్టర్ షకీలా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందొ అందరికి తెలిసిందే. అయితే ఆమె చాలా రోజుల తరువాత తన సినిమా గురించి అభిమానులను రిక్వెస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాస్పిటల్ నుంచి తన ఆరోగ్య సమస్య గురించి చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. అంతకుముందు సినిమాను చూసి తనను బ్రతికించాలని ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆర్థిక నష్టాల్లో షకీలా..
బి గ్రేడ్ సినిమాలతో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన నటి షకీలా. అప్పట్లో మలయాళంలో ఆమె ఊహించని స్థాయిలో క్రేజ్ అందుకున్నారు. కొన్నాళ్లకు ఆర్థికంగా నష్టపోయిన షకీలా ఒక సినిమాను నిర్మించారు. అయితే ఆ అడల్ట్ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అప్పుల నుంచి బయటపడాలని ఆమె డిజిటల్ వరల్డ్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ఒక విసియోను కూడా రిలీజ్ చేశారు.

హాస్పిటల్ నుంచే సందేశం..
లేడీస్ నాట్ అలౌడ్ అనే ఒక అడల్ట్ సినిమాను మొత్తానికి అదే పేరుతో ఉన్న వెబ్ సైట్ లో నిన్న రిలీజ్ చేశారు. అనంతరం ఆమె సడన్ గా హాస్పిటల్ కి వెళ్లాల్సి రావడం వలన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయినట్లు ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. కొంచెం హెల్త్ బాగాలేదు. అందుకే హాస్పిటల్ కి వచ్చాను. తప్పకుండా సినిమా చూడండి అంటూ హాస్పిటల్ నుంచే నెటిజన్స్ ని కోరింది.

సెన్సార్ వల్ల ఇబ్బందులు..
ఈ సినిమా కారణంగా షకీలా ఊహించని విధంగా సమస్యల్లో పడింది. మగవాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడాలని అప్పట్లో బాగానే ప్రమోషన్స్ చేశారు. ఇక లాక్ డౌన్ కి ముందు సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్న సమయంలో సెన్సార్ వల్ల ఇబ్బందులు తప్పలేదు. షూటింగ్ పూర్తయిన రెండేళ్ల తరువాత ఈ సినిమాను వెబ్ సైట్ లో రిలీజ్ చేశారు.

మూడు నెలల్లోనే షూటింగ్..
ఇటీవల సినిమా ఆలస్యం కావడానికి గల కారణాన్ని షకీలా బాధతో తెలిపింది. సినిమా తీసి దాదాపు రెండేళ్లు అవుతోంది. 3 నెలల్లోనే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కానీ సెన్సార్ పనులు పూర్తి చేయడానికి ఏడాది సమయం పట్టింది. సెన్సార్ కోసం హైదరాబాద్, చెన్నై, బాంబే, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్ళాము. కానీ సెన్సార్ దొరకలేదు.
Recommended Video

నా డబ్బులన్ని ఈ సినిమాపైనే..
ఆ సెన్సార్ కారణంగా ఇబ్బందులు పడుతుండగా సడన్ గా కరోనా వచ్చి మరిన్ని ఇబ్బందులకు గురి చేసింది. నేను దాచుకున్న డబ్బు సేవింగ్స్ ఈ సినిమాపైనే పెట్టాను. ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. వడ్డీకి అప్పులు చేశాను. వడ్డీ డబ్బులు తరువాత ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పినా కూడా అప్పులు ఇచ్చిన వారు ఉరుకోవడం లేదు. దీని వల్ల ఒత్తిడికి లోనవుతున్నాము.

సినిమా చూసి బ్రతికించండి
ఈ మధ్య కాలంలో సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయవచ్చని తెలుసుకున్నాను. అందుకే సినిమా టైటిల్ తోనే వెబ్ సైట్ క్రియేట్ చేసి అందులో సినిమాను రిలీజ్ చేస్తున్నాము. టికెట్ ధర 50రూపాయలు మాత్రమే. ఇది ఒక అడల్ట్ సినిమా మాత్రమే. లేడీస్ ఈ సినిమా చూడవద్దు. మగవాళ్లకు మాత్రమే. దయచేసి ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించండి. మేము నెక్స్ట్ సినిమా తిస్తామో లేదో తెలియదు గాని ఇప్పటికైతే బ్రతికిపోతాము అంటూ షకీలా తన వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications