అసభ్యంగా చేతులు వేస్తే అలా చేసేదాన్ని.. ఇప్పటి హీరోయిన్లు చేస్తున్నది కరెక్ట్ కాదు.. షకీలా!

Recommended Video

Shakeela About Metoo Movement And Heroines | Filmibeat Telugu

శృంగార తార షకీలాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బి గ్రేడ్ చిత్రాలతో ఒక ఊపు ఊపింది. రెగ్యులర్ చిత్రాలతో కూడా నటించింది. అప్పట్లో షకీలాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని ఈ శృంగార తార ధీటుగా ఎదుర్కొంది. షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో పెట్రేగుతున్న కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపై షకీలా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీటూ వేధింపుల విషయంలో హీరోయిన్లకు కొన్ని సూచనలు చేసింది.

అలాంటి రకాన్ని కాదు

అలాంటి రకాన్ని కాదు

లైగికంగా ఎవరైనా వేధిస్తే ఆలస్యంగా స్పందించే రకం కాదు నేను. అలాంటి వాళ్లకు వెంటనే తగిన బుద్ది చెప్పే దాన్ని అని షకీలా మీటూ ఉద్యమం గురించి మాట్లాడింది. హీరోయిన్లకు చిత్ర పరిశ్రమలో వేధింపులు ఎదురవుతున్నాయనే విషయం తెలుసు. అవకాశాల పేరుతో హీరోయిన్లని లోబరుచుకోటం ఇటీవల ఎక్కువవుతోందనే విమర్శలు ఎదురవుతున్నాయి.

హీరోయిన్లు అలా చేయకూడదు

హీరోయిన్లు అలా చేయకూడదు

నటీమణుల ఎవరైనా లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే బయట పెట్టడమో, అక్కడే వారికీ తగిన బుద్ది చెప్పడమో చేయాలి. కానీ ఏళ్ల తరువాత స్పందించడం తెలివైన పని కాదు అని షకీలా పేర్కొంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై తనుశ్రీ దత్త చేసిన మీటూ ఆరోపణలు దేశం మొత్తం పెను ప్రకంపనలు సృష్టించాయి. ఆ స్పూర్తితో చాలా మంది హీరోయిన్లు మీటూ ఉద్యమంలో పాల్గొన్నారు.

అసభ్యంగా చేతులు వేసినవాళ్ళే

అసభ్యంగా చేతులు వేసినవాళ్ళే

తనపై కూడా చాలా మంది అసభ్యంగా చేతులు వేసేవారని షకీలా పేర్కొంది. తాను వారికీ అక్కడిక్కడే బుద్ది చెప్పేదానిని. అప్పట్లో నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారే ఇప్పుడు తనని చూసి చేతులు కట్టుకుంటారని షకీలా పేర్కొంది. షకీలా తన చిత్రాల కోసం రాజకీయ నాయకులతోనే అప్పట్లో పోరాడింది. తన అందాల ఆరబోత, శృంగార సన్నివేశాలతో షకీలా అప్పట్లో యువతని హీట్ ఎక్కించేది.

షకీలా బయోపిక్

షకీలా బయోపిక్

షకీలా జీవితం ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. షకీలాకు నాట్ ఎ పోర్న్ స్టార్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంద్రజిత్ లంకేశ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా షకీలా పాత్రలో నటిస్తుండడం విశేషం. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ లో రిచా చద్దా హాట్ అప్పియరెన్స్ తో అదరగొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X