అసలే షకీలా ... ఆపై రొమాంటిక్
హైదరాబాద్: సెక్స్ బాంబ్ గా పేరు తెచ్చుకుని దాదాపు రిటైర్ మెంట్ స్టేజికి వెళ్లిన షకీలా తన రొమాంటిక్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటోందా...అవుననే అనిపిస్తోంది..ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం టైటిల్ వింటూంటే... ఆ టైటిల్ రొమాంటిక్ టార్గెట్. నరేష్, శ్వేత, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యం క్రియేషన్స్ పతాకంపై మెంటా సత్యనారాయణ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.
షకీలా మాట్లాడుతూ... నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాల్ని ప్రశ్నిస్తూ, వాటిని ఎలా ఎదుర్కొవాలో తెలియజెప్పే చిత్రమిది. యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్‌లతో కూడి వుంటుంది. వినోదానికి పెద్దపీట వేశాం అన్నారు.

యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్ మేళవింపుతో ఆద్యంతం ఆసక్తికరంగా మలిచిన ఈ చిత్రంలో షకీలా, బాబాభాయ్, కావేరి, స్వప్న, ఆరోహి, శేషు, స్వామి, ఆజాద్, సత్యం, రాధాకృష్ణ, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, అశోక్, దేవి తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేశ్, పాటలు: బొబ్బా, శ్రీవాస్తవ్, సంగీతం: కార్తీక్, అభిషేక్, ఛాయాగ్రహణం: కంకణాల శ్రీనివాసరెడ్డి, సహ నిర్మాత: జల్లేపల్లి నరేశ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: షకీలా.


Click it and Unblock the Notifications











