వదిలేస్తారని తెలిసినప్పుడు వాళ్లతో పిల్లలను ఎలా కంటాను: షకీలా షాకింగ్ కామెంట్స్

Recommended Video

Shakeela Sensational Comments On Her Love Stories || Filmibeat Telugu

షకీలా.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఆమె పాపులర్ అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఏ హీరోకూ రాని గుర్తింపు ఆమె దక్కింది. కారణం.. శృంగార తార కావడమే. తనపై పడిన శృంగార తార అనే మచ్చను పోగొట్టుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె విఫలమయ్యారు. ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన ఈ బోల్డ్ లేడీ.. క్రేజ్‌తో పాటు ఆస్తులను కూడా కోల్పోయారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి

లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి

షకీలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గతంలో ఆమె లవ్ ఫెయిల్ అవడమే. ఈ శృంగార తార ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే, వాళ్లంతా పెళ్లి చేసుకోడానికి మాత్రం సిద్ధ పడలేదని కూడా షకీలా పలుమార్లు చెప్పుకొచ్చారు.

నా డబ్బు కోసమే ప్రేమించారు

నా డబ్బు కోసమే ప్రేమించారు

ఈ ఇంటర్వ్యూలో షకీలా తన ప్రేమకథలు.. అవి విఫలం అవడానికి కారణాలను వెల్లడించారు. ‘నేను చాలా మందితో లవ్ ట్రాక్ నడిపిన విషయం వాస్తవమే. కానీ, ఎవరితోనూ ఎక్కువ కాలం లేను. నన్ను ప్రేమించానని చెప్పిన వాళ్లంతా నా దగ్గర డబ్బును వాడుకుని వదిలేశారు. అందుకే నేను ఎవరినీ వివాహం కూడా చేసుకోలేకపోయాను' అని వెల్లడించారు.

అతడిని పెళ్లి చేసుకుందామనుకున్నా

అతడిని పెళ్లి చేసుకుందామనుకున్నా

ఎన్నో ప్రేమ కథలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అనుకున్నానని షకీల తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నా లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఒక్కొక్కడితో పదేళ్లు, ఏడేళ్లు, నాలుగేళ్లు ఇలా ఉండేదాన్ని. నా లాస్ట్ వాడు నితీష్ కుమార్ అతనితో పదేళ్లు ఉన్నా. నేను ఇప్పటికీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే పెళ్లి అయ్యేది' అని ఆమె తెలిపారు.

విడిపోతారని తెలిసి ఎలా కంటాను?

విడిపోతారని తెలిసి ఎలా కంటాను?

మీరు ప్రేమించిన ఏ వ్యక్తితోనైనా పిల్లల్ని కనాలని అనుకున్నారా..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘నాకు పిల్లలంటే ఇష్టమే. కానీ, వాళ్లను తయారు చేసి స్కూల్‌కు పంపడం వంటివి నచ్చదు. ఇక, నా విషయానికొస్తే.. పిల్లల్ని కనాలన్న కోరిక ఎప్పుడూ కలగలేదు. పైగా నన్ను లవ్ చేసిన వారు ఎవరూ ఎక్కువ రోజులు నాతో లేరు. వాళ్లు వదిలేస్తారని తెలిసి పిల్లల్ని ఎలా కంటాను' అని ఆమె పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X