షకీలా దర్శకత్వంలో సినిమా
దర్శకురాలిగా తొలి అడుగు వేస్తున్న ఈచిత్రంలో షకీలా లీడ్ రోల్ నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం తనకు నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రం ఆమె నటించిన గత సెక్స్ సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం చూడదగ్గ విధంగా ఉంటుందని తెలుస్తోంది.
సెక్స్ చిత్రాలతో ఒప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన షకీలా ఆ తర్వాత ఆ... సినిమాలకు స్విస్తి చెప్పింది. సెక్స్ తార ఇమేజ్ పొగొట్టుకోవడానికి చాలా ట్రైచేసింది. మామూలు సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. షకీలా లాంటి సెక్సీ లేడీని మామూలు పాత్రల్లో చూడటానికి ఎవరూ మాత్రం ఇష్ట పడతారు చెప్పండి. షకీలాపై ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన పలువురు దర్శకులు.... మరీ బూతు పాత్రలు కాకుండా శృంగారం టచ్ ఉన్న పాత్రలు, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన సన్నివేశాలు ప్లాన్ చేసేవారు. కొన్ని సినిమాల్లో ఇవి బాగానే వర్కౌట్ అయ్యాయి కూడా. మరి దర్శకురాలిగా కెరీర్ మొదలు పెట్టబోతున్న షకీలా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












