ఎఫైర్ గురించి లీక్ చేసిన షకీలా: ఇప్పుడు 13 ఏళ్ల చిన్నోడితో.. ఈ వయసులో అలా చేస్తే తప్పేముంది అంటూ!
బీ గ్రేడ్ హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. స్టార్లకు పోటీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న తార షకీలా. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదితో పాటు దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేసిందామె. అంతేకాదు, స్టార్ హీరోలతో సైతం పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకాదరణను పొందింది. తద్వారా ఇండియాలో మొట్టమొదటి శృంగార తారగా వెలుగొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే లెగసీని కంటిన్యూ చేస్తోంది. ఇక, తాజాగా షకీలా మరోసారి ప్రేమలో పడినట్లు తెలిపింది. అది కూడా 13 ఏళ్ల చిన్నోడితో అని షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

బీ గ్రేడ్ హీరోయిన్.. ఏ గ్రేడ్ ఫాలోయింగ్
దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండియన్ సినిమాపై తన హవాను చూపించింది శృంగార తార షకీలా. కేవలం బీ గ్రేడ్ హీరోయిన్‌గానే పేరు సంపాదించుకున్నప్పటికీ.. ఏ హీరోయిన్‌కూ రాని ఫాలోయింగ్‌ను తన సొంతం చేసుకుంది. కేవలం రొమాంటిక్ సినిమాల్లోనే నటించిన ఈమె.. భారతదేశంలోనే ఏకైక శృంగార తారగా అప్పట్లో ఆమె గుర్తింపును పొందింది. అందుకే ఆదరణను అందుకుంది.

స్టార్ హీరోలకే పోటీ ఇచ్చిన ఏకైక భామ
షకీలా నటించిన సినిమాలకు విపరీతమైన ఆదరణ లభించేది. ఆమె ప్రతి చిత్రానికి హౌస్‌ఫుల్ బోర్డులు పడిపోయేవి. అంతలా ఈ మల్లూ హీరోయిన్ సినీ రంగంపై ప్రభావాన్ని చూపించింది. అంతేకాదు, ఆమె సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుండేది. అందుకే ఆమె సినిమా విడుదలైన సమయంలో స్టార్ హీరోలే వెనక్కి తగ్గేవాళ్లు. చిన్న సినిమాలైతే వాయిదా పడిపోయేవి.

ఒక్కొక్కరితో కొన్ని సంవత్సరాల ప్రేమ
తనకు ఎన్నో ప్రేమ కథలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అనుకున్నానని షకీలా కొద్ది రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'నా లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఒక్కొక్కడితో పదేళ్లు, ఏడేళ్లు, నాలుగేళ్లు ఇలా ఉండేదాన్ని. నా లాస్ట్ వాడు నితీష్ కుమార్ అతనితో పదేళ్లు ఉన్నా. నేను ఇప్పటికీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే పెళ్లి అయ్యేది' అని ఆమె తెలిపారు.

లవర్ల వల్ల మొత్తం కోల్పోయిన షకీలా
షకీలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గతంలో ఆమె ప్రేమలు విఫలం అవడమే. ఈ శృంగార తార ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే, వాళ్లంతా పెళ్లి చేసుకోడానికి మాత్రం సిద్ధ పడలేదని కూడా షకీలా పలుమార్లు చెప్పుకొచ్చారు. అలాగే, తన ఆస్తుల విషయంలోనూ మోసపోయారామె.

మరోసారి ప్రేమలో పడిన శృంగార తార
సుదీర్ఘమైన ప్రయాణంలో ఎంతో మందితో డేటింగులు చేసింది షకీలా. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సార్లు స్వయంగా చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను వెల్లడించింది. అదే సమయంలో తాను మరోసారి ప్రేమలో పడిపోయానంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.

ఇప్పుడు 13 ఏళ్ల చిన్నోడితో లవ్ ట్రాక్
తాజా ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.. 'గతంలో నాకు చాలా మంది లవర్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి 30 ఏళ్లు.. నాకు 43 సంవత్సరాలు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. లవ్ అంటే లవ్ అంతే. ఈ వయసులో లవ్ ఏంటి అనుకోవాల్సిన పనిలేదు. అయినా ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు' అంటూ చెప్పారు.

ఈ వయసులో అలా చేస్తే తప్పేముంది
తన ప్రేమ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. 'నేను పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం లేదు. ఇప్పుడు లవ్‌లో ఉన్న వ్యక్తి ఇంకా బ్యాచ్‌లర్. పెళ్లైన వ్యక్తిని నా వైపు తిప్పుకుని వాళ్ల ఫ్యామిలీని డిస్ట్రబ్ చేయడం లేదు. కాబట్టి నాకెలాంటి అభ్యంతరం లేకుండానే బంధాన్ని కొనసాగిస్తున్నా. ప్రేమకు వయసుతో పని లేదు అనేది నా గట్టి నమ్మకం' అని స్పష్టం చేసింది శృంగార తార షకీలా.


Click it and Unblock the Notifications











