twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ బాంబ్ షకీలా 'ఖతర్నాక్ రాణి' అంటున్న...

    By Srikanya
    |

    శృంగార చిత్రాల్లో నటించి పెద్ద హీరోలకు సైతం పోటీ ఇచ్చి చెమటలు పట్టించిన షకీలా మళ్ళీ చిరకాల విరామం తర్వాత వెండి తెరపై కన్పించబోతోంది.తాజాగా షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం 'ఖతర్నాక్ రాణి'. ఎం.ఎం.సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై గప్పిట మధుమోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆర్.చిదంబరం నిర్మిస్తున్నారు. సినిమా విశేషాలను నిర్మాత ఆర్.చిదంబరం చెబుతూ "ఈ చిత్రం షూటింగ్ ఈ నెల్లోనే మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయింది. నవంబరు 1 నుంచి రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన షకీలా ఈ చిత్రంలో ధైర్య సాహసాలు ప్రదర్శించే రెబెల్ పాత్రలో కనిపించబోతోంది. టైటిల్‌కి తగ్గట్టుగానే తన పాత్ర కూడా ఖతర్నాక్‌గానే ఉంటుంది. సంఘ విద్రోహ శక్తులైన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న అరాచకాలను షకీలా ఒక యువకుని సాయంతో ఎలా ఎదుర్కొంది అనేది కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రముఖ రచయిత గప్పిట వెంకటరావు మనవడు సతీష్ ‌బాబు ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X