షకీలా సినిమాకు షాక్.. టైటిల్ మార్చేయమంటున్న సెన్సార్ బోర్డు, నా సినిమాకే ఎందుకు!
Recommended Video

శృంగార తార షకీలా చాలా గ్యాప్ తరువాత నటించిన చిత్రం శీలవతి. ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్స్ కూడా చిత్రంపై ఆసక్తిని పెంచాయి. వరుసగా విడుదల వాయిదా పడుతుండగా ఈ నెలలో విడుదలవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ సభ్యులే ఈ చిత్ర విడుదలకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో స్వయంగా షకీలా రంగంలోకి దిగి సెన్సార్ సభ్యులని నిలదీస్తోంది.
పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి

250 వ చిత్రం
శీలవతి.. షకీలా నటిస్తున్న 250 వ చిత్రం కావడం విశేషం. షకీలా చాలా కాలం గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కానీ ఈ చిత్ర విడుదలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి.

షకీలా చిత్రానికి ఆ టైటిల్ ఉండకూడదు
ఈ నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని సెన్సార్ ముందుకు ఈ చిత్రాన్ని తీసుకుని వెళ్లగా వారు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. షకీలా చిత్రానికి అలాంటి టైటిల్ ఉండకూడదని సెన్సార్ సభ్యులు చెప్పడంతో చిత్ర యూనిట్ షాక్ కి గురయ్యారు. టైటిల్ మార్చాల్సిందే అని ఆదేశించినట్లు తెలుస్తోంది.

నా సినిమాకే ఎందుకు
ఈ వివాదంపై షకీలా స్పందించింది. సినిమా చూడకుండానే ఈ టైటిల్ ఎందుకు వద్దంటున్నారో తనకు కారణం చెప్పాలని షకీలా అడుగుతోంది. డబ్బింగ్ చిత్రానికి కూడా ఇదే టైటిల్ పెట్టామని, సినిమా విడుదుల అయ్యేలా సహకరించాలని కోరింది.

ప్రమోషన్ కూడా చేశాం
సినిమాకు ఇప్పటికే ప్రమోషన్ కూడా చేశామని షకీలా తెలిపింది. ఇప్పుడు టైటిల్ మార్చమంటే కుదరదని, ఎందుకు టైటిల్ మార్చమంటున్నారో కారణం చెప్పాలని కోరింది.


Click it and Unblock the Notifications











