షకీలా ఆత్మకథ..భయపడుతున్న సినీ జనం
సెక్స్ బాంబ్ షకీలా త్వరలో తాను ఆత్మ కథ రాయబోతున్నానని ప్రకటించింది.అంతేగాక అందులో ఆమె అందులో ఉన్నదున్నట్లు నిజాలు రాస్తానని చెప్పుకొచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె తో రిలేషన్ ఉన్న చాలా మంది సినీ జనం భయపడుతున్నారు. ఆమె తమ గురించి ఏమి రాయబోతుందో అని కంగారుపడుతున్నారు.కొందరైతే ఆమెను ఆత్మ కథ రాయటం అవసరమా అన్నట్లు నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తువ్నట్లు సమాచారం. ఇక షకీలా ఈ విషయమై మాట్లాడుతూ...నేను ప్రపంచానికి నా గురించి పూర్తి నిజాలు చెప్పాలనుకుంటున్నాను.నాకు ఈ విషయమై ఏమీ బాధ లేదు. నా ఊహించని విధంగా నా సినీ జీవితం మలుపులు తిరిగింది.
అయితే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను...నాలో మంచి నటి ఉన్నదనే విషయం. అయితే నిర్మాతలెవరూ ఎందుకనో ఆ విషయం పట్టించుకోలేదు. నేను అప్పుడప్పుడూ మళయాళంలో మంచి క్యారెక్టర్స్ వేసినా నా ఇమేజ్ దాన్ని దెబ్బతీసింది. అయితే తెలుగు దర్శకుడు తేజ నాకు మంచి పాత్ర ఇచ్చి మెచ్చుకున్నారు. ఆయనకు కృతజ్ఢతలు. నా పర్శనల్ లైఫ్ గురించి చెప్పాలంటే నాకో బాయ్ ప్రెండ్ ఉన్నాడు. అతనితో నేను ప్రతీ విషయం షేర్ చేసుకుంటాను. ఇక షకీలాగా నేను ఏనాడు ఆనందం అంటే ఎరగలేదు అంది బాధగా. ప్రస్తుతం ఆమె మళయాళంలో పృధ్వీరాజ్ తాజా చిత్రం తేజా భాయ్ అండ్ ఫ్యామిలీలో చేసాను. అది నాకు మళ్ళీ మంచి పాత్రలు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాను అంది.


Click it and Unblock the Notifications











