For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు

  |

  స్టార్ హీరోలు.. హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ను అందుకుని దాదాపు రెండు దశాబ్దాల పాటు తన హవాను చూపించారు పాపులర్ నటి షకీలా. బీ గ్రేడ్ సినిమాలతో బీభత్సం సృష్టించిన ఆమె.. రోజుకు కాకుండా గంటల చొప్పున రెమ్యూనరేషన్ అందుకుంటూ సత్తా చాటారు. ఇలా చాలా తక్కువ సమయంలోనే పేరు పరంగా, ఆస్తుల పరంగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. కానీ, ఒక్కసారిగా అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మహానటి సావిత్రి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

  Wet South Indian Actresses In Beach Photos

  Shakeela To Release Her Film In OTT Platform
  ఇండియాలోనే ఆ తరహాలో మొదటి నటి

  ఇండియాలోనే ఆ తరహాలో మొదటి నటి


  1994 నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపుతూ హాట్ టాపిక్‌గా నిలిచారు షకీలా. కేవలం బీ గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నారు. తన ప్రతి సినిమాకూ హౌస్‌ఫుల్ బోర్డులు పడేలా ఆమె రెచ్చిపోయి నటించేవారు. ఈ కారణంగానే భారతదేశంలోనే ఏకైక శృంగార తారగా అప్పట్లో ఆమె గుర్తింపును పొందారు.

  స్టార్లకు కూడా దక్కని క్రేజ్.. పోటీగా రిలీజ్

  స్టార్లకు కూడా దక్కని క్రేజ్.. పోటీగా రిలీజ్


  షకీలా సినిమాలకు దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ విపరీతమైన ఆదరణ లభించేది. అన్ని రకాల వయసుల వాళ్లూ ఆమె అందాలను చూసేందుకు పోటీ పడేవారు. దీంతో ఈ శృంగార తార సినిమాలు ఆడే థియేటర్లు అన్నీ కలకళలాడిపోతుండేవి. అందుకే ఒకానొక సందర్భంలో స్టార్ హీరోల సినిమాలతో పోటీగా ఆమెకు కలెక్షన్లు వచ్చేవి. కొందరైతే షకీలా సినిమా ఉంటే భయపడేవారు.

  ఆస్తులు పోడానికి కారణం ఆ వ్యవహారాలే

  ఆస్తులు పోడానికి కారణం ఆ వ్యవహారాలే


  షకీలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గతంలో ఆమె ప్రేమలు విఫలం అవడమే. ఈ శృంగార తార ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే, వాళ్లంతా పెళ్లి చేసుకోడానికి మాత్రం సిద్ధ పడలేదని కూడా షకీలా పలుమార్లు చెప్పుకొచ్చారు. అలాగే, తన ఆస్తుల విషయంలోనూ మోసపోయారామె.

  పడుకోడానికి రెడీ అంటూ అలీకి కౌంటర్లు

  పడుకోడానికి రెడీ అంటూ అలీకి కౌంటర్లు


  ఈ మధ్య సినిమాలు తగ్గించిన షకీలా.. కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ‘అలీతో సరదాగ' అనే షోకు వచ్చారు. ఈ సందర్భంగా హోస్ట్ అలీ మాట్లాడుతూ.. ‘మీకు స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నట్లుంది. బైకులకు అలా ఉంటే పడుకోబెట్టి ఒక్కటి కొడతారు' అని అన్నాడు. దీనికి స్పందించిన షకీలా ‘ఇక్కడ పడుకోడానికి కూడా నేను రెడీగా ఉన్నాను' అని చెప్పి షాకిచ్చారు.

  సావిత్రి మృతిపై షకీలా సంచలన వ్యాఖ్యలు

  సావిత్రి మృతిపై షకీలా సంచలన వ్యాఖ్యలు


  అలీ షోకు గెస్టుగా వచ్చిన షకీలా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను మాట్లాడారు. అలాగే, తన కెరీర్ ఒక్కసారిగా డౌన్ అవడానికి గల కారణాలు, ప్రేమ వ్యవహారాలు విఫలం అవడానికి కారణం, పెళ్లి కాకపోవడం, ఆస్తులు కోల్పోయిన విషయాలను ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగానే మహానటి సావిత్రి మరణంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

  సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది

  సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది


  తన ఆస్తుల కోల్పోయిన విధానం మహానటి సావిత్రి పరిస్థితి ఒకేలా ఉన్నదన్న కామెంట్లపై స్పందించిన షకీలా.. ‘‘జెమినీ గణేషన్ మొదటి భార్య కూతురు ఒక ప్రశ్న అడిగింది.. సావిత్రి గారు చాలా మంచిది.. ఎవరు ఏమి అడిగినా తీసి ఇచ్చేస్తుంది.. పుణ్యం మాత్రమే చేసుకుంది. అయితే ఎందుకు అలా చచ్చింది'' అని అడిగింది. ఆ పాయింట్ నాకు బాగు గుచ్చుకుంది' అని చెప్పుకొచ్చిందామె.

  అలాంటివి చేయడమే తప్పు అంటున్నారా?

  అలాంటివి చేయడమే తప్పు అంటున్నారా?

  దీనిని కొనసాగిస్తూ.. ‘సావిత్రి గారు చివరి అంకంలో ఆస్తులన్నీ కోల్పోయారు. చివరికి హాస్టటల్‌కి కూడా వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో ఆమె గవర్నమెంట్ హాస్పటల్‌లో చనిపోయింది. అంటే ధర్మం చేయొద్దని అంటారా' అంటూ ఎదురు ప్రశ్నించింది షకీలా. దీంతో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక, ఇది వచ్చే సోమవారం ప్రసారం కానుంది.

  English summary
  Shakeela, known mononymously as Shakeela, is an Indian actress and model who predominantly acted in Cinema of South India. Shakeela debuted in the film Playgirls (1995) at the age of 18 as a supporting actress. She appeared in about 250 films, most of them softcore, which made her a major sex symbol in the late 1990s and early 2000s.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X