ఆ తెలుగు నటి నన్ను నిజంగానే కొట్టింది.. నా సినిమాలో అలా చూపిండం తప్పు: షకీలా కామెంట్స్

షకీలా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. బీ గ్రేడ్ సినిమాల్లో నటించి దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదితో పాటు దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేసిందామె. అంతేకాదు, స్టార్ హీరోలతో సైతం పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకాదరణను పొందింది. తద్వారా వయసుతో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అంతటి పేరు సంపాదించిన ఆమె.. కొంత కాలంగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది. ఆఫర్లు రాక.. ఆస్తులు లేక ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో షకీలా కొన్ని సీక్రెట్లు లీక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

 ఏకైక శృంగార తార.. హౌస్‌ఫుల్ బోర్డులు

ఏకైక శృంగార తార.. హౌస్‌ఫుల్ బోర్డులు

1994 నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపుతూ హాట్ టాపిక్‌గా నిలిచారు షకీలా. కేవలం బీ గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నారు. తన ప్రతి సినిమాకూ హౌస్‌ఫుల్ బోర్డులు పడేలా ఆమె రెచ్చిపోయి నటించేవారు. ఈ కారణంగానే భారతదేశంలోనే ఏకైక శృంగార తారగా అప్పట్లో ఆమె గుర్తింపును పొందారు.

స్టార్ హీరోలే భయపడిపోయేలా చేసింది

స్టార్ హీరోలే భయపడిపోయేలా చేసింది

షకీలా సినిమాలకు దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ విపరీతమైన ఆదరణ లభించేది. అన్ని రకాల వయసుల వాళ్లూ ఆమె అందాలను చూసేందుకు పోటీ పడేవారు. దీంతో ఈ శృంగార తార సినిమాలు ఆడే థియేటర్లు అన్నీ కలకళలాడిపోతుండేవి. అందుకే ఒకానొక సందర్భంలో స్టార్ హీరోల సినిమాలతో పోటీగా ఆమెకు కలెక్షన్లు వచ్చేవి. కొందరైతే షకీలా సినిమా ఉంటే భయపడేవారు.

ప్రేమ వ్యవహారాల వల్లే అన్నీ కోల్పోయి

ప్రేమ వ్యవహారాల వల్లే అన్నీ కోల్పోయి

షకీలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గతంలో ఆమె ప్రేమలు విఫలం అవడమే. ఈ శృంగార తార ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే, వాళ్లంతా పెళ్లి చేసుకోడానికి మాత్రం సిద్ధ పడలేదని కూడా షకీలా పలుమార్లు చెప్పుకొచ్చారు. అలాగే, తన ఆస్తుల విషయంలోనూ మోసపోయారామె.

నా సినిమాలో అలా చూపిండం తప్పు

నా సినిమాలో అలా చూపిండం తప్పు

తాజాగా షకీలా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన బయోపిక్ మూవీ 'షకీలా' గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. 'ఆ సినిమా తీస్తున్నట్లు నాకు తెలీదు. అందులో అవాస్తవ సన్నివేశాలు ఉన్నాయి. చాలా సీన్లు కల్పితంగా తీసినవే. అది నా బయోపిక్ అనిపించలేదు' అన్నారు.

ఆమెతో నాకు పోటీ అని చూపించారు

ఆమెతో నాకు పోటీ అని చూపించారు

ఇదే ఇంటర్వ్యూలో అలనాటి తార సిల్క్ స్మిత గురించి కూడా మాట్లాడింది షకీలా. 'నా బయోపిక్‌తో పాటు ఆ మధ్య వచ్చిన 'దర్టీ పిక్చర్'లో సిల్క్ స్మిత గారికి నాకు పోటీ ఉందని చూపించారు. నిజానికి అది చాలా తప్పు. ఆమె ఎక్కడ.. నేను ఎక్కడ? అసలు ఆమెను నాకు సమానంగా భావించను. నాకంటే ఎంతో పెద్ద నటి ఆమె. తను నాకు ఆదర్శం' అంటూ చెప్పుకొచ్చిందామె.

ఆ తెలుగు నటి నన్ను నిజంగానే కొట్టింది

ఆ తెలుగు నటి నన్ను నిజంగానే కొట్టింది

ఓ సారి షూటింగ్ స్పాట్‌లో తనకు జరిగిన చేదు అనుభవం గురించి మాట్లాడింది షకీలా. 'సిల్క్ స్మిత గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఓ సారి షూటింగ్ స్పాట్‌లో ఆమె నాతో కఠువుగా ప్రవర్తించింది. అప్పుడు నన్ను చెంప మీద కొట్టింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నన్ను ఏదోలా చూశారు. ఆ తర్వాత ఆమె నాకు సారీ చెప్పి మాట్లాడింది కూడా' అని ఆమె వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X