twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శీలవతి’ నాకు చాలా స్పెషల్: షకీలా.. ఆగస్టు 17న రిలీజ్

    By Rajababu
    |

    'జీ' స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా 250 వ చిత్రంగా, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'శీలవతి'. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చితం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఆగస్ట్ 17 న విడుదల కాబోతుంది.

    ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. "ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ఇది నా 250వ చిత్రం. ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యమున్న పాత్రలో నటించాను. నెక్స్ట్ సీన్ ఏంటి అనే ఉత్కంఠ కలిగేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. ఆగస్ట్ 17న వస్తున్న ఈ 'శీలవతి'ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.." అని అన్నారు.

    Shakeela: Sheelavati is special to me

    నిర్మాతలు రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. "సెన్సార్ ట్రబుల్స్ ని ఎదుర్కొని సక్సెస్ ఫుల్ గా ఆగస్ట్ 17 న 'శీలవతి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. దర్శకుడు సాయిరామ్ దాసరి సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇది కేరళలో జరిగిన యథార్థ సంఘటన. ఈ సినిమా చూశాక.. ఇంతకు ముందు షకీలా వేరు ఈ సినిమా తరువాత షకీలా వేరు అని అందరూ అంటారు. తప్పకుండా అందరూ సినిమా చూసి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాం.. '' అన్నారు.

    షకీలా, అర్జున్(జబర్దస్త్), గీతాంజలి (ఫ్రూటీ), అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రజ్వల్ క్రిష్, డిఓపి: తరుణ్ కరామ్ తోత్, ఎడిటర్స్: శ్రీనివాస రాజలింగు, కె ఆర్. స్వామి, నిర్మాతలు: రాఘవ ఎమ్ మహేష్, వీరు బాసింశెట్టి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సాయిరామ్ దాసరి.

    English summary
    Shakeela's 250 movie is Sheelavati. This movie set release on August 17th. This movie is directed by Sai Ram Dasari. Raghava, Veeru Basimsetty are the producers. In this occassion, Shakeela said that Sheelavati is very special to me.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X