twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా నన్ను నగ్నంగా చూపించారు.. అంతా డైరెక్టర్ తేజ వల్లే.. షకీలా!

    By Rajababu
    |

    Recommended Video

    బ్లూఫిలింలో నటిస్తారా అని అడిగారు : షకీలా

    దక్షిణాది సినీ పరిశ్రమలో నటి షకీలా సృష్టించి సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే పెద్ద హీరోలు, నిర్మాతల గుండెల్లో దడ పుట్టేది. ఆమె సినిమాలు రిలీజ్ అయితే తమ సినిమాలు ఆడవని షకీల సినిమాలు నిషేధించేవారు. అలాంటి నటి జీవిత కథ ఆధారంగా బయోపిక్ వస్తున్నది. ఈ చిత్రంలో షకీలాగా బాలీవుడ్ నటి రిచా చద్దా నటించనున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచాచద్దాతో షకీలా తన అనుభవాలను పంచుకొన్నారు. అవి ఆమె మాటల్లోనే..

    అలా నన్ను న్యూడ్‌గా

    అలా నన్ను న్యూడ్‌గా

    సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు డూప్‌లను ఉపయోగిస్తారని తెలుసు. కానీ నగ్నంగా నటించడానికి ఒప్పుకోని హీరోయిన్లకు డూప్‌లను ఉపయోగించి న్యూడ్‌గా చూపుతారని నాకు తెలియదు. నా విషయంలో అదే జరిగింది. నేను లేకుండానే ఓ సీన్‌లో మరో మహిళను డూప్‌గా ఉపయోగించి నేను నగ్నంగా నటించినట్టు చూపించారు.

    నా సినిమాలు చూడలేకపోయాను

    నా సినిమాలు చూడలేకపోయాను

    నేను చెన్నైలో నివసించే దానిని. అక్కడ సినిమా హాళ్లన్నీ ప్రేక్షకులతో నిండిపోయి ఉండేవి. దాంతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేకపోయేదానిని. అందువల్ల నా సినిమాలలో నేను ఎలా ఉంటాను అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాను.

    ఇమేజ్‌ సమస్యతో సినిమాలకు

    ఇమేజ్‌ సమస్యతో సినిమాలకు

    నా ఇమేజ్ వల్ల నా సినిమాలకు సమస్యలు ఎదురయ్యేవి. నేను ఓ సినిమాలో క్రైస్తవ సన్యాసి (నన్)‌గా చూపించారు. ఆ సినిమా ప్రారంభానికి ముందే ‘మీరు చాలా రిస్క్ తీసుకొంటున్నారు' అని నిర్మాతను హెచ్చరించారు. కానీ నన్ను నన్‌గానే చూపించడానికి సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్‌ను కొందరు అడ్డుకొన్నారు. ఇప్పటికి 15 ఏళ్లు అయింది. ఆ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు.

     ఇండస్ట్రీలో హిపోక్రసి

    ఇండస్ట్రీలో హిపోక్రసి

    సినిమా షూటింగ్‌లో సీన్ ఒకటి చెబుతారు. కానీ షూట్ చేసేటప్పుడు నా వక్షోజాలపై, పిరుదులపై కెమెరా పెడుతారు. ఆ సమయంలో మనం ఏమీ చెయడానికి ఉండదు. ఇండస్ట్రీలో అంతా హిపోక్రసి. పైకి శ్రీరంగనీతులు చెబుతారు. చేసేది మాత్రం మరోలా ఉంటుంది అని షకీలా అన్నారు.

    సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా

    సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా

    నా చిత్రాలతోపాటు పెద్ద హీరోల సినిమాలు రిలీజైతే అవి ఆడకపోయేవి. దాంతో నేను నటించిన చిత్రాలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించకుండా చేసేవారు. అశ్లీలత ఉండేదని నా సినిమాలను బ్యాన్ చేశారు. నా కెరీర్ మంచి జోరులో ఉన్నప్పుడు ప్రతీ శుక్రవారం తమ సినిమాల రిలీజవుతుంటే కొంత మంది నిర్మాతలకు నిద్ర పట్టేది కాదు.

     బ్లూఫిలింలో నటిస్తారా అని

    బ్లూఫిలింలో నటిస్తారా అని

    అర్ధనగ్న సన్నివేశాలను వ్యతిరేకించడం వల్ల మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలో కొంత మంది బ్లూ ఫిలింస్‌లో నటిస్తారా అని సంప్రదించారు. అలాంటి గడ్డుపరిస్థితిలో దర్శకుడు తేజ పిలిచి జయం సినిమాలో అవకాశం ఇచ్చారు. దాంతో నా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. కన్నడలో చాలా అవకాశాలు వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు పెరిగాయి.

    పెళ్లి చేసుకోవాలనుకొన్నా.. కానీ

    పెళ్లి చేసుకోవాలనుకొన్నా.. కానీ

    ఓ దశలో పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని అనుకొన్నాను. కానీ నా తల్లి అడ్డుపడింది. అప్పుడు నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను. ఒకవేళ పెళ్లి చేసుకొంటే ఆదాయం ఆగిపోయి కుటుంబం రోడ్డున పడుతుందని నా తల్లి భయపడింది. నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని వాళ్లను నా తల్లికి పరిచయం చేస్తే వారిని అంగీకరించేది కాదు.

     నేను డేటింగ్ చేస్తున్నా

    నేను డేటింగ్ చేస్తున్నా

    నేను ప్రస్తుతం డేటింగ్ చేసే వ్యక్తికి నాపై చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. నా వయసు 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచే నేను రిలేషన్ షిప్‌లో ఉన్నాను. ఒంటరి జీవితం చాలా బాగున్నది అని షకీల చెప్పారు.

    English summary
    Popular actor Shakeela's life story coming onto silverscreen. Actress Richa Chadha will portray the role of Shakeela. This movie is directed by Indrajit Lankesh. In this occassion, Shakeela speaks to media recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X