ప్రభుదేవా సినిమాలో షకిరా?
కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన డాన్స్ మూవ్ మెంట్సే. అంత స్పీడ్ ఆయన డాన్స్ లో ఉంటుంది. దర్శకుడిగా నువ్వు వస్తానంటే నేనొద్దన్నానా, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా త్వరలో మరో నూతన చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ నూతన చిత్రంలో షకీరాతో డాన్స్ చేయించడానికి ప్రభుదేవా ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ సినిమా హిందీలో రూపొందుతున్న పోకిరి చిత్రంగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా సల్మాన్ ఖాన్, ఆయేషా టకియా నటిస్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ చేసిన ఐటమ్ సాంగ్ ను షకీరా తో చేయించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆమె సై అంటుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











