బాయ్ ఫ్రెండ్ ద్వారా...మళ్లీ గర్భం దాల్చింది!
కాలిఫోర్నియా: ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ షకీరా గత కొంత కాలంగా పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఇప్పటికే ఒక బాబుకి జన్మినిచ్చారు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా 'మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. ప్రస్తుతం బాబు వయసు 19 నెలలు.
తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్ ద్వారా షకీరా మళ్లీ గర్భం దాల్చింది. ఇద్దరూ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారు. షకీరా మళ్లీ గర్భం దాల్చిందని, ఆమె ఎంతో సంతోషంగా ఉందని షకీరా క్లోజ్ ఫ్రెండ్ కార్లోస్ వేవ్స్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2015లో ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయం షకీరా ద్వారా ఖరారు కావాల్సి ఉంది.

గెరార్డ్ పిక్‌తో షకీరా 2010 నుండి సహజీవనం చేస్తోంది. షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... నాలుగేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్ ద్వారా రెండు సార్లు గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 37 సంవత్సరాలు.


Click it and Unblock the Notifications











