జూ ఎన్టీఆర్ ‘శక్తి’ని... ఇలా కూడా వాడుకుంటున్నారు!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం 'శక్తి'. ఈచిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే పరమ ప్లాపు చిత్రంగా నిలవడంతో పాటు నిర్మాతకు భారీ నష్టాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్లాపు మూవీని రకరకాలుగా వేడసుకుంటున్నారు బాలీవుడ్ మూవీ మేకర్స్.
ఈ సినిమాను హిందీలో అప్పట్లో 'ఏక్ థా సోల్జర్' పేరుతో అనువదించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ మాదిరిగానే... హిందీ వెర్షన్ కూడా అక్కడ పెద్దగా ఆడలేదు. ఈచిత్రంలోని బ్యాగ్రౌండ్ స్కోర్ గా ఉపయోగించి రుద్ర సౌండ్ ధీమ్ ను ఇప్పుడు తాజాగా బాలీవుడ్లో రూపొందుతున్న 'జిల్లా గజియాబాద్' చిత్రం కోసం వాడుకుంటున్నారు. రుద్ర సౌండ్ థీమ్‌ను శక్తి సినిమా కోసం మణిశర్మ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే.
అర్షద్ వర్సీ, వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్, మినీషా లాంబా తదితరులు ప్రధాన పాత్ర దారులుగా రూపొందుతున్న చిత్రం 'జిల్లా గజియాబాద్'. సినిమా స్టోరీ రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగుతుంది. వినోద్ బచ్చన్, షోమెన్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 60 కోట్లతో నిర్మాణం అవుతున్న ఈచిత్రం ఫిబ్రవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో చార్మి కూడా ఓ పాత్ర పోషిస్తోంది. శ్రియ, గీతా బస్రాలు హాట్ అండ్ సెక్సీగా ఐటం సాంగుల్లో అందాలు ఆరబోయనున్నారు. ఇందులో హీరో అర్షన్ వర్సీ... హీరోయిన్ మినీషా లాంబ రొమ్ము భాగాన్ని చేత్తో టచ్ చేసిన సన్ని వేశానికి సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తూ వివాదాస్పదంగా మారాయి.
జూ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆయన 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈచిత్రంలో హీరోయిన్. ఈ చిత్రం ఆడియో ఈ మార్చి 10 న విడుదల కానుంది. అలాగే చిత్రం ఏప్రియల్ 5న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











