కెనడాలో జూ ఎన్టీఆర్ ‘శక్తి’ హక్కులను సొంతం చేసుకున్న టివిసి మూవీస్..!
మెహర్ రమేష్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఇలియానా కథానాయిక గా అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రం శక్తి" హక్కులను కెనడాలో టివిసి మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతకుముందెన్నడూ ఇంత బడ్జెట్ ను పెట్టి తీసిన సినిమా దాకలాలు లేవు. కాగా ఈ చిత్రాన్ని టివిసి మూవీస్ సంస్ద గతంలో కెనడాలో ఖలేజా మరియు బృందావనం సినిమాలను, తర్వాత ఆరెంజ్ సినిమాలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ అత్యంత భారీ బడ్జెట్ సినిమా శక్తి హక్కులను సొంతచేసుకోవడమే కాకుండా మెహర్ రమేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతకుమునుపెన్నడూ చూడని విధంగా ఒక బెస్ట్ చిత్రంగా రికార్డు నెలకొల్పుతుందని 'శక్తి"పై భారీ అంచనాలతో ఈ హక్కులను సొంతం చేసుకొన్నామని టివిసి మూవీస్ వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30 సినిమాని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ సినిమా తమిళ భాషలోకీ అనువాదమవుతోంది. రెండు భాషల్లోనూ ఒక్కేసారి విడుదలవుతుందని సమాచారం. మార్చి 30వ రిలీజ్ అవబోతున్న జూ.ఎన్టీఆర్ 'శక్తి' సినిమాపై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇందులో జూ.ఎన్టీఆర్ డ్యూయోల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర ఎన్టీఆర్ ఎప్పుడూ చేసే క్యారెక్టర్స్ కి దగ్గరగానే ఉంటుంది. కానీ మరో క్యారెక్టర్ మాత్రం ప్రేక్షకాభిమానుల్ని ఆశ్యర్యపరిచేలా ఉంటుందని తెలిసింది. బడ్జెట్ లిమిట్ లేకుండా తీస్తున్న చిత్రమని 'శక్తి' ఆడియో విడుదల రోజునే అశ్వినీదత్ తెలిపారు.'మగధీర' తరువాత తెలుగు తెరపై వస్తున్న అత్యంత బడ్జెట్ సినిమాగా 'శక్తి' చరిత్రకెక్కుతుందని అంటున్నారు. జూ.ఎన్టీఆర్ 'శక్తి" చిత్రంలో 5 రకాల గెటప్ లలో కనబడతాడని ఈ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తెలిపాడు. శక్తి, రుద్ర గా చిత్రంలోని ఎన్టీఆర్ స్టిల్ల్స్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











