twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర, అరుంధతి లా హంగామా చేయనున్న జూ ఎన్టీఆర్ ‘శక్తి’..!?

    By Sindhu
    |

    సరికొత్త తరహా చిత్రాలని ఖర్చుకి వెరవకుండా గ్రాండ్ గా తెరకెక్కిస్తే రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుందని 'మగధీర", 'అరుంధతి"తో రుజవైంది అదే నమ్మకంతో జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న 'శక్తి"చిత్రం మీద తన శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు నిర్మాత అశ్వనీదత్. గత ఏడాది ఫిబ్రవరి 6న రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రం ఏడాది కాలంగా సెట్స్ మీదే ఉంది. అలాగే మరో ఏడెనిమిది నెలలు ఫ్రీ ప్రొడక్షన్ లోనే గడిపింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న'శక్తి" పబ్లిసిటీ క్యాంపైన్ ఈ నెల 14న మొదలవుతుంది. ఇంతదాకా ఈ చిత్రానికి సంబందించిన స్టిల్స్, గెటప్స్ అన్నీ సీక్రెట్ గా ఉంచారు.

    అయితే సినిమా మార్చి 30న విడుదలకి సిద్దమవుతూ ఉండడంతో 'శక్తి" హంగామాకి తెర లేపుతున్నారు. ఫిబ్రవరి 27లేదా మార్చి 2న ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లేదా గుంటూరులో జరుగుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ 'శక్తి" ఎంతనేది, బాక్సాఫీస్ వద్ద అతని స్టామినా ఏమిటనేది తెలుస్తుందని చిత్ర రూపకర్తలే కాక అభిమానులు సైతం నమ్మకంగా ఉన్నారు. ఇన్నాళ్లు ప్రొఫైల్ లో ఉంచిన ఈ చిత్రాన్ని ఇకపై హైప్ చేస్తారో లేక సైలెంట్ గా వచ్చి తమ 'శక్తి" చూపిస్తారో వేచి చూడాల్సిందే..

    English summary
    Junior NTR’s much anticipated film ‘Shakti’ audio may release on 27 of this month or 2nd March. The venue could be either Hyderabad or Guntur.The film’s promotional campaigns will release on Feb 14th. Film is scheduled for release on 30th March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X