జూ ఎన్టీఆర్ ‘శక్తి’ హై క్వాలిటీ కోసమే ప్రాగ్ సిటిలో మెరుగులు...!
జూ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శక్తి' సినిమా ప్రస్తుతం అన్ని రకాలుగానూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా రీరికార్డింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం చెకోస్లోవియా రిపబ్లిక్ రాజధాని నగరమైన ప్రాగ్ లో జరుగుతున్నాయి. చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ ప్రస్తుతం ఈ పని మీదే ప్రాగ్ సిటీలో వున్నారు. హై క్వాలిటీ కోసం అక్కడ రీరికార్డింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోందనీ, ఈ సినిమా జూ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుందనీ నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక ప్రింట్లతో దీనిని ఈ నెల 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలియానా, మంజరి ఇందులో కథానాయికలుగా నటించారు.


Click it and Unblock the Notifications











