మరో రికార్డును క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన జూ ఎన్టీఆర్ ‘శక్తి’..!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి' అప్పుడే రికార్డులను తిరగరాస్తుంది. 45 కోట్లతో నిర్మితమైన చిత్రం, ప్రచార చిత్రాలలో జూ ఎన్టీఆర్ ఆకర్షణగా కనిపించటం మొదలగు అంశాలు సినిమా మీద అంచనాలను వీపరితంగా పెంచాయి. దాంతో అత్యధిక మొత్తాలకు సినిమా ప్రదర్సన హక్కులను సొంతం చేసుకుంటున్నారు పంపిణి దారులు. విడుదల తేది దగ్గర పడే కొద్ది ప్రాంతాల వారిగా రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతుంది.
తాజాగా జూ ఎన్టీఆర్ కు పట్టున్న గుంటూరు జిల్లాలో శక్తి దాదాపు 4 కోట్ల బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇంత వరుకు 2 .5 కోట్ల మొత్తమే గుంటూరులో రికార్డు. అంతే కాకుండా నైజం, సీడెడ్ ప్రాంతాలలో విడివిడిగా10 కోట్ల వ్యాపారం జరిగినట్టు వినికిడి. ఓవర్ సీస్ లో కూడా రెండున్నర కోట్లకు అమ్ముడుపోయింది. విడుదలకు ముందు ఎన్ని రికార్డులు సృష్టించినా సినిమా విజయవంతం అయితేనే అందరు ఆనందించేది లేని పక్షంలో పరిస్థితులను అంచనా వేయటం కూడా కష్టమే.


Click it and Unblock the Notifications











