కార్తీ ‘శకుని’ లోగో విడుదల
కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం 'శకుని'. కార్తీ సరసన ప్రణీత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం లోగోను డి.రామానాయుడు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు ''మా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన పలు చిత్రాల్లో శివకుమార్ నటించారు. తన మాతృభాష తమిళంలో ఎంత పేరు తెచ్చుకున్నారో తెలుగులో కూడా అంతే పేరు సంపాదించుకోగలిగారు. శివకుమార్ తనయుడు కార్తీ కూడా ఇక్కడ విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు ఎన్.శంకర్‌దయాళ్ మాట్లాతుతూ.."ఇది పొలిటికల్ సెటైర్ మూవీ, ఓ ట్రావెల్‌లాగా ఉంటుంది, కార్తీ పాత్రలో చాలా వైవిధ్యత ఉంటుంది'' అని అన్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. సంతానం, రాధిక, కోట శ్రీనివాసరావు, రోజా, నాజర్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, కెమెరా: పి.జి.ముత్తయ్య, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: ప్రేమ్క్ష్రిత్, బాబా భాస్కర్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్.


Click it and Unblock the Notifications











