twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తి ‘శకుని’ తెలుగు రైట్స్ అంతా?

    By Bojja Kumar
    |

    యుగానికి ఒక్కడు, ఆవారా, నాపేరు శివ చిత్రాల ద్వారా తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ హీరో కార్తి త్వరలో 'శకుని' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్.శంకర్‌దయాళ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న 'శకుని' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

    ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బెల్లొండ సురేష్ ఈచిత్రాన్ని దాదాపు రూ. 8 కోట్లు చెల్లించి తెలుగు హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. గతంలో కాంచన తో పాటు పలు తమిళ చిత్రాల తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకుని బాగా లాభాలను ఆర్జించిన బెల్లకొండ ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    జి.వి.ప్రకాష్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను జూన్ 1న శిల్పకళావేదికలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా విడుదల చేయనున్నారు. జూన్ రెండో వారంలో సినిమాను విడుదల చేయనున్నారు.

    'శకుని అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు. ఓ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు కదలడం లేదు. ఈ వాతావరణంలో ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు అనేదే 'శకుని'చిత్రం స్టోరీ లైన్.

    ప్రణీత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్‌, రోజా, సంతానం తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, బాబా భాస్కర్‌, సహ నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌, ఎస్‌.ఆర్‌.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌ దయాళ్‌.

    English summary
    Producer Bellamkonda Suresh has repotedly bought the rights of the Telugu-Tamil bilingual film Shakuni starring Karthi and Pranitha. “Karthi is an energetic and talented actor. He also has an eye for good scripts,” said Suresh, who plans to release the film’s audio on June 1 and the film in the second week of June.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X