శకుని కాదు శ్రీకృష్ణ పరమాత్మ...ట్విస్టుల మీద ట్విస్టులు...
యుగానికొక్కడు, ఆవారా సినిమాల కార్తి ఇప్పుడు శకునిలా మారాడు. నిజంగా అనుకునేరు..సినిమా కోసమే..తాను నటించిన ప్రతి చిత్రమూ తెలుగులో విడుదల చేయాలని ఉబలాటపడుతున్న కార్తి ఇప్పుడు తాను నటించిన ఓ చిత్రాన్ని తెలుగులో శకుని పేరుతో విడుదల చేయనున్నాడు. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మాతగా కార్తి తన స్వంత బ్యానర్ స్టూడియో గ్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయనున్నాడు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.
భారతంలో శకుని పాత్ర అందరికీ తెలిసిందే. అతని ఎత్తుగడలన్నీ విపక్షానికి లాభం చేకూర్చేవే. స్వపక్షాన్ని దెబ్బతీయడానికే. ఇలాంటి పాత్రే రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందన్న...ఆలోచన ఓ సినిమా దర్శకుడికి వచ్చింది. వెంటనే సినిమా తీయడానికి డిసైడ్ అయిపోయాడు. శకుని పాత్ర వేయడానికి తమిళ నటుడు కార్తి ఓకే చెప్పాడు. ఇంకేం..నవరసాలూ తెరపై ఒలికించే శకుని త్వరలో సినీ ప్రేక్షకుడు చూడబోతున్నాడు. ఆ సినిమా వివరాలేంటంటే...
యుగానికి ఒక్కడు, ఆవారా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు కార్తి. రాజకీయ వ్యవస్థపై 'శకుని' అనే వ్యంగ్య చిత్రాన్ని తీస్తున్నారు. ప్రణీత హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. వివి వినాయక్ దగ్గర పనిచేసిన ఎన్.శంకర్‌దయాళ్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. శకుని అనేది నెగెటివ్ టైటిల్ అయినా అది ఎవరు? అనేది చిత్రంలో చూడాల్సిందేనని కార్తి చెబుతున్నాడు. 'ముందుగా టైటిల్ పెట్టినప్పుడు భయపడ్డాను. పూర్తిగా కథ విన్నాక.. శకుని కాదు శ్రీకృష్ణ పరమాత్మ పోలికలు ఉన్న రోల్ ఉంటుందని తెలుసుకున్నా. ఇందులో చాలా గెటప్స్ ఉంటాయి. ఇరవై నిముషాలకొక ట్విస్ట్ వస్తుందని హీరో కార్తి చెబుతున్నాడు...


Click it and Unblock the Notifications











