Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
కామెడీ, క్రైమ్, థ్రిల్... శమంతకమణి ట్రైలర్: టాలీవుడ్ మల్టీస్టారర్ హవా మొదలైనట్టేనా?
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శమంతకమణి ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. కామెడీ ని కలుపుకొని సరదాగా సాగిపోయే థ్రిల్లర్ స్టోరీ కా కనిపిస్తోంది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శమంతకమణి. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది,రాజేంద్ర ప్రసాద్, అనన్య సోనిలు ఈ మల్టీ స్టారర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సుధీర్ బాబు తనయుడు దర్శన్ కూడా ఈ మూవీలో నటిస్తున్నాడు. తొలి సారి తండ్రి, తనయులు శమంతకమణి చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.నలుగురు మీడియం హీరోలు వున్నా కూడా జస్ట్ పది కోట్ల లోపు బడ్జెట్ లో ఈ సినిమా ఫినిష్ చేయడం విశేషం.
రోల్స్ రాయిస్ కారు చుట్టూ
ఖరీదైన రోల్స్ రాయిస్ కారు చుట్టూ తిరిగే థ్రిల్లర్ జోనర్ కథ ఇది. ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటిస్తున్నారు. పదికోట్ల లోపు బడ్జెట్ తో తయారైన ఈ సినిమాకు శాటిలైట్ ముందే ఫినిష్ చేసేసారు. రెండున్నర కోట్ల రేంజ్ లో ఫినిష్ అయింది. ఆంధ్రను నాలుగు నుంచి అయిదు కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు.
అఫీషియల్ ట్రైలర్
ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ‘శమంతకమణి'ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో అన్ని క్యారెక్టర్లను చూపిస్తూ హైదరాబాద్‌లోని ఏదో స్టార్ హోటల్లో ఓ కారు చుట్టూ తిరగే క్రైమ్ కామెడీగా రూపొందింది.
థ్రిల్లర్ స్టోరీ
మోషన్ పోస్టర్ దగ్గరి నుంచీ ఇప్పటి ఈ ట్రైలర్ దాకా శమంతకమణి మంచి బజ్ నే క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. కామెడీ ని కలుపుకొని సరదాగా సాగిపోయే థ్రిల్లర్ స్టోరీ కా కనిపిస్తోంది. గతం లో వచ్చిన టీజర్, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ఈ శమంతకమణి చుట్టూనే తిరుగుతుందని అర్థమైపోతోంది.
కారు పేరే శమంతకమణి
ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ కారుని దొంగిలించాలనుకునే క్యారెక్టర్ సుధీర్ బాబు ది అనిపించేలా ఉంది, ఆదీ, సందీప్ కిషన్ ల ని, నారా రోహిత్ నీ చూస్తూంటే ఆకారు చుట్టూ తిరిగే క్రైం కథ అనీ, ఆ కారు పేరే శమంతకమణి అని అర్థమౌతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. జూలై లోనే మూవీని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.