twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనే హీరో... కాదు నేనే: శమంతకమణి వేడుకలో హీరోల ఫన్నీ ఫైట్

    శమంతకమణి ప్రి రీలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో హీరోల మధ్య ఫన్నీ ఫైట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    By Bojja Kumar
    |

    నారా రోహిత్‌, సుధీర్ బాబు, సందీప్ కిష‌న్‌, ఆది ప్రధాన పాత్రల్లో భ‌వ్య క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం శ‌మంత‌క‌మ‌ణి. చాందిని చౌద‌రి, జెన్ని హ‌నీ నాయిక‌లు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంతో ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లోని జేఆర్సీ సెంటర్లో సోమవారం సాయంత్రం జ‌రిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పూరి జ‌గ‌న్నాథ్ సీడీల‌ను విడుద‌ల చేశారు.

    ఈ సందర్భంగా.... ఈ చిత్రంలో నటించిన నలుగురు హీరోలు నారా రోహిత్‌, సుధీర్ బాబు, సందీప్ కిష‌న్‌, ఆది సినిమాలో నేనే హీరో.. కాదు నేనే అంటూ ఫన్నీగా వాదులాడుకోవడం వేడుకకు హాజరైన అభిమానులను మెప్పించింది. నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ఇందులో హీరో ఎవ‌ర‌న్న‌ది నాక్కూడా తెలియ‌డం లేదు... చమత్కరించారు.

    నలుగురం కలిసి సరదాగా

    నలుగురం కలిసి సరదాగా

    సందీప్ కిష‌న్ మాట్లాడుతూ ``న‌లుగురు హీరోలు క‌లిస్తే స‌ర‌దాగా షూటింగ్ చేసుకోవ‌చ్చు అని చెప్ప‌డానికి `శ‌మంత‌క‌మ‌ణి` మంచి ఉదాహ‌ర‌ణ‌. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి నుంచి చాలా నేర్చుకున్నాను. సుధీర్ నాకు క్లోజ్ ఫ్రెండ్‌. హార్డ్ వ‌ర్క్ అనే విష‌యాన్ని ఇష్ట‌ప‌డ‌తాడు. రోహిత్ సెన్సిబిలిటీస్ అంటే నాకు ఇష్టం. ఆది నాకు ఎప్ప‌టినుంచో ఫ్రెండ్‌. నిర్మాత‌గారు మా అంద‌రినీ స‌మానంగా చూసుకున్నారు. శ్రీరామ్ ఆదిత్య సినిమాను చాలా బాగా డీల్ చేశాడు. నా పాత్ర‌ను సినిమాలో చూస్తేనే న‌చ్చుతుంది`` అని తెలిపారు.

    అంద‌రం మంచి పాత్ర‌లు చేశాం

    అంద‌రం మంచి పాత్ర‌లు చేశాం

    నారా రోహిత్ మాట్లాడుతూ ఇందులో అంద‌రం మంచి పాత్ర‌లు చేశాం. త‌ప్ప‌కుండా హీరో శ్రీరామ్ ఆదిత్య‌. మంచి క‌థ‌ను తీసుకొచ్చి మాతో చేయించారు. షూటింగ్ అంతా ఎంతో సరదాగా సాగిందని తెలిపారు.

    మా ద‌ర్శ‌కుడే ఈ సినిమాకు హీరో

    మా ద‌ర్శ‌కుడే ఈ సినిమాకు హీరో

    ఆది మాట్లాడుతూ... మా ద‌ర్శ‌కుడే ఈ సినిమాకు హీరో. చాలా బాగా తీశాడు. డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. మిగిలిన హీరోల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. న‌లుగురుం ఎక్క‌డా ఇగోల‌కు పోలేదని తెలిపారు.

    తల్లిలేని అబ్బాయిగా సుధీర్

    తల్లిలేని అబ్బాయిగా సుధీర్

    సుధీర్‌బాబు మాట్లాడుతూ... రియ‌ల్ లైఫ్‌లో నీ ద‌గ్గ‌రిలో ఉన్న పాత్ర‌నే నువ్వు తెర‌మీద చేస్తావ‌ని కొంద‌రు హీరోలు స‌ల‌హా ఇచ్చారు. అప్ప‌టి నుంచి పాటిస్తున్నా. ఇందులో నేను త‌ల్లి లేని అబ్బాయిలాగా న‌టించా. ని `శ‌మంత‌క‌మ‌ణి` అనే కారు కోసం అంద‌రూ సినిమా చూడాలి అన్నారు.

    శమంత‌క‌మ‌ణి ఒక అంద‌మైన క‌ల‌

    శమంత‌క‌మ‌ణి ఒక అంద‌మైన క‌ల‌

    రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``శమంత‌క‌మ‌ణి ఒక అంద‌మైన క‌ల‌. ఈ సినిమాలో నాకు విప‌రీతంగా న‌చ్చింది ఏంటంటే.. న‌లుగురు హీరోలూ ఎవ‌రికి వారే హీరో అని కొట్ట‌కునేంత గొప్ప‌గా శ్రీరామ్ క‌థ రాశారు. అంద‌రూ ఈ సినిమాను చూసి ఆశీర్వ‌దించాలి అన్నారు.

    హీరో , హీరోయిన్లు ఉండ‌రు. అంద‌రూ క్యార‌క్ట‌ర్లే ఉంటారు

    హీరో , హీరోయిన్లు ఉండ‌రు. అంద‌రూ క్యార‌క్ట‌ర్లే ఉంటారు

    శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ``ఈ క‌థ రాసుకునేట‌ప్పుడు ఉద్యోగం మానేశాను. ఆ టైమ్‌లో నాకు మా నాన్న ఆరు నెల‌లు శాల‌రీ ఇచ్చారు. నేను ఫ‌స్ట్ రాసుకున్న క‌థ‌లోనే న‌లుగురు హీరోలు అని అనుకున్నా. మా హీరోలంద‌రూ నాకు సోద‌రులు లాంటివారు. ఆదికి చాలా గొప్ప ఎనర్జీ ఉంటుంది. సందీప్ కి, నాకూ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సుదీప్‌గారు చాలా ఫోక‌స్‌గా ఉంటారు. చాలా ప్యాష‌నేట్‌గా ఉంటారు. త‌న‌ని చూస్తే మ‌న ఎనర్జీ లెవ‌ల్స్ డ్రాప్ అయినా, వెంట‌నే పెరుగుతాయి.. రాజేంద‌ప్ర‌సాద్‌గారితో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ఫ‌ర్ మి. మా సినిమాలో హీరో , హీరోయిన్లు ఉండ‌రు. అంద‌రూ క్యార‌క్ట‌ర్లే ఉంటారు అన్నారు.

    English summary
    Shamanthakamani pre release function held at JRC convensions center. Shamantakamani is a 2017 Telugu action thriller film, produced by V. Anand Prasad on Bhavya Creations banner and directed by Sriram Adittya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X