షామిలి దర్శకురాలవుతోంది!
జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో ముద్దులొలికే పలుకులతో అందరినీ ఆకట్టుకున్న బేబి షామిలీ. ఇటీవల సిద్దార్థ్ సరసన 'ఓయ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. కానీ త్వరలో షామిలీ మరో కోణంలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఆమె సింగపూర్‌లో 8 నెలలు దర్శకత్వ శాఖలో కోచింగ్ తీసుకుంటోంది. ఆ కోర్సు జూలైలో ముగియనుంది. ఈ కోర్సులో లైటింగ్, ఎడిటింగ్ లతో పాటు దర్శకత్వశాఖకు అవసరమైన వన్నీ నేర్పుతారు. 'ఓయ్ తర్వాత హీరోయిన్ ఆఫర్లు వచ్చినా షామిలీ ఆసక్తి చూపకుండా దర్శకత్వంపైనే దృష్టి పెట్టిందని షామిలీ అన్నయ్య హీరో రిషి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే షామిలీ దర్శకురాలు కాబోతోంది.
షామిలి ఓయ్ సిద్దార్ధ జగదేకవీరుడు అతిలోకసుందరీ చిరంజీవి శ్రీదేవి shamili oye siddharth jagadekaveerudu athilokasundari chiranjeevi sridevi


Click it and Unblock the Notifications