షామిలీ 'ఓయ్'అంటోందిట...ఎవరినంటే!!

మణిరత్నం 'అంజలి' చిత్రంలో జుట్టు విరబోసుకుని ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే బేబి షామిలీ ఈ చిత్రంతోనే హీరోయిన్ గా ప్రమోషన్ పొందుతోంది. ఆమెను చాలా కాలం నుండి పెద్ద పెద్ద దర్శకులు సైతం హీరోయిన్ గా తమ సినిమాల్లో అడిగారుట. అయితే ఆమె ఎప్పుడూ ఒప్పుకోలేదు. అయితే ఇన్నాళ్ళుకు ఒప్పుకోవటానికి కారణం ఆమె సిద్దార్దకి వీర ఫ్యాన్ కావటమే కారణమని చెప్తున్నారు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది.
దానయ్య నిర్మాతగా ఈ చిత్రాన్ని త్వరలోనే రెగ్యులర్ ప్రారంభించటానకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సినిమా ప్రారంభం కొద్ది కాలం క్రిందట సైలెంట్ గా జరిగింది. ప్రస్తుతం సిద్దార్ధ నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న 'కొంచెం ఇష్టంగా...కొంచెం కారంగా' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











