ఎన్టీఆర్ సరసన షామిలి?
అంజలి పాపగా ప్రేక్షకులను అలరించిన బాలనటి షామిలి కథానాయికగా మారి 'ఓయ్' అని పిలిచినా ప్రేక్షకులనుండీ సరైన స్పందన రాకపోవడంతో చదువుకోవడానికి సింగపూర్ వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాలు చేసే ఆలోచన లేదని, మంచి అవకాశాలస్తే ఆలోచిస్తానంటోంది. "ఇంత పెద్ద జీవితం తొందరెందుకు" అని 'ఓయ్' సినిమా డైలాగులు చెబుతోంది. అంతే కాకుండా తన అక్క షాలిని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం, తన బావ అజిత్ హీరోగా మంచి స్థాయిలో వుండటం తనకు బాగా హెల్ప్ అవుతుందని భావిస్తోంది.
ఇదిలా వుంటే షామిలికి ఈ మధ్య ఓ మంచి అవకాశం వచ్చిందట. అదీ టాలీవుడ్ నంబర్ వన్ రేసులో ముందజలో వున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం. దీంతో షామిలి ఈ చిత్రానికి పచ్చ జెండా ఊపేసిందని సమాచారం. మొదటి సినిమాతో హోమ్లీ ఇమోజ్ తెచ్చుకున్న షామిలి ఈ సినిమాలో ఎలా కనిపించనుందో చూడాలి.
shamili jr ntr oye siddharth adurs vv vinayak nayantara షామిలి జూ ఎన్టీఆర్ ఓయ్ సిద్దార్థ్ అదుర్స్ వివి వినాయక్ నయనతార


Click it and Unblock the Notifications